30 ఏళ్లకు నెరవేరిన అభిమానుల కల…

Ranga idol unveiling

Advertisements

&NewLine;<p>30 సంవత్సరాలుగా వంగవీటి మోహన రంగా అభిమానులు ఎదురుచూస్తున్న రంగా విగ్రహం ఏర్పాటు&comma; ఆవిష్కరణ కల ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చొరవతో సాకారమైంది&period; భారీ ర్యాలీగా ఎమ్మెల్యే కి స్వాగతం పలుకుతూ వైసీపీ రంగా అభిమానులు మైలవరం పొలిమేర నుండి విగ్రహం వద్దకు తరలి వచ్చారు&period; ఎమ్మెల్యే వసంత తో పాటు ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాపు కార్పోరేషన్ చైర్మన్ అడపా శేషు&comma; వైయస్సార్ సీపీ సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్&comma; కఠారి ఉమా మహేశ్వర రావు తదితర వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు&period; ఎమ్మెల్యే విగ్రహావిష్కరణ‌ చేసే సమయంలో తనకు కూడా అహ్వానమందడంతో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల గాంధీ తన కార్యకర్తలతో అక్కడికి చేరుకుని ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్నారు&period; అనంతరం వేదిక పైకి ఆహ్వానించినా కొద్దిసేపు అక్కల గాంధీ వేదిక పైకి రాకుండా విగ్రహం వద్దే నిలుచుని ఉండడంతో పలుమార్లు అక్కల గాంధీని వేదిక పైకి ఆహ్వానించారు&period; నిర్వాహకులు తర్వాత వేదిక పైకి వచ్చిన అక్కల గాంధీ వంగవీటి మోహన రంగా చరిత్ర వివరించే ప్రయత్నం చేశారు&period; ఈ క్రమంలోనే వంగవీటి రంగా సోదరుడు రాధా ని కమ్యూనిస్టులు హత్య చేశారని&comma; అనంతరం రంగా అనూహ్య పరిణామాల మధ్య రాజకీయాల్లోకి వచ్చారని వివరించారు&period; రాధా ని కమ్యూనిస్టులు చంపారని చెప్పి&comma; రంగా హత్య అనంతరం భారత దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో 48 రోజుల పాటు కర్ఫ్యూ విధించడం చరిత్ర అని చెప్పి వేదిక పైన కూర్చోకుండానే తన ప్రసంగాన్ని ముగించి వేదిక దిగి వెళ్ళిపోయారు&period; ఆయన వెళ్ళిన తర్వాత వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు గర్నేపూడి వెంకట్రావు మైక్ తీసుకుని రాధాని కమ్యూనిష్టులు చంపారని చెప్పిన గాంధీ&comma; రంగా ని తెలుగుదేశం వాళ్ళు చంపారని ఎందుకు చెప్పలేకపోయారంటూ ఆగ్రహాన్ని వెలిబుచ్చే క్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వారించే ప్రయత్నం చేశారు&period; తర్వాత కాపు కార్పోరేషన్ చైర్మన్ అడపా శేషు మాట్లాడుతూ రంగా విగ్రహానికి దండ వేయని వాళ్ళు కూడా రేపు ఎన్నికలకు రంగా గుండెల్లో ఉన్నారని బయలుదేరతారని రంగా అభిమానులు గ్రహించాలన్నారు&period; ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ రంగా విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టమన్నారు&period; తన తండ్రికి రంగా కి మద్య సత్సంబందాలున్నాయని ఈ సంధర్బంగా గుర్తు చేసుకున్నారు&period; కుల మతాలకు తాను అతీతమన్నారు&comma; అన్నికులాలకు ప్రాథాన్యతనిచ్చే క్రమంలో కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ నియామకం విషయంలో స్వంత పార్టీలోనే కుమ్ములాటలు&comma; గొడవల్లో తన ఆశయాన్ని దెబ్బకొట్టారని ఆవేదన వెలిబుచ్చారు&period; రంగా లాగానే తాను కూడా రాబోయే రోజుల్లో కూడా అన్ని కులాలకు సమాన ప్రాథాన్యతనిచ్చి అధికారం కల్పిస్తానన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.