సాదాసీదాగా కొనసాగిన సర్వసభ్య సమావేశం…

Zilla Praja Parishad

Advertisements

&NewLine;<p>పార్టీలకతీతంగా జిల్లాను అభివృద్ధిలోకి తీసుకెళ్లేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు మాణిక్యరావు&comma; సునీత లక్ష్మారెడ్డి&comma; చింతా ప్రభాకర్ లు అన్నారు&period; కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా నిర్వహించిన సర్వసభ్య సమావేశం సాదాసీదాగా కొనసాగింది&period; సంగారెడ్డిలోని జడ్పి సమావేశ మందిరంలో జిల్లా ప్రజా పరిషత్ సర్వే నిర్వహించారు&period; ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రజా సంక్షేమానికి&comma; సమస్యలను పరిష్కరించేనందుకు ముందు ఉండాలన్నారు&period; టిఆర్ఎస్ ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగించాలని వారు కోరారు&period; అనంతరం జిల్లా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు రోడ్లు&comma; మంచినీటి సౌకర్యాలతోపాటు అర్హులకు అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు&period; అనంతరం నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు చర్యలు చేపడుతుందని అన్నారు&period; ప్రజలకు మేలు చేసే గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు&period; ఈ సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పలువురు జెడ్పిటిసిలు&comma; ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.