98
చిత్తూరు జిల్లాలో ఏనుగులు సైర్వ విహారం చేస్తున్నాయి. కుప్పం మండలంలో ఏనుగుల గుంపు హల్ చల్ చేస్తోంది. అడవిలో నీరులేక పంటపొలాలను సర్వ నాశనం చేస్తున్నాయి. గజరాజులను అడవిలోకి మళ్లించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలిఫెంట్ ట్రాకర్స్ వేకువ జామున పైపాళ్యం గ్రామానికి చెందిన మునిరత్నంపై ఏనుగులు దాడి చేశాయి. దీంతో రైతు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయడంతో కిందపడి గాయాలయ్యాయి. ప్రస్తుతం రైతు కుప్పం వైద్యకళాశాలలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏనుగుల బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు.
ఇది చదవండి: రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.