రైతులకు – ఫారెస్ట్ అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం

farmers and forest officials

Advertisements

&NewLine;<p>నాగర్ కర్నూల్ జిల్లాలో రైతులకు &&num;8211&semi; ఫారెస్ట్ అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది&period; లింగాల మండలంలోని అప్పాయిపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో గుంతలు తవ్వేందుకు వెళ్లిన ఫారెస్ట్ అధికారులకు &&num;8211&semi; రైతులకు మధ్య తోపులాట జరిగింది&period; తమకు పట్టాలు ఉన్న భూమిలో ఫారెస్ట్ అధికారులు వచ్చి జెసిబితో తమ భూముల్లో కందకాలు తీస్తుడంతో రైతులు జెసిబి అద్దాలు పగులగొట్టారు&period; ఏళ్ల తరబడి సాగు చేస్తున్న తమ భూముల్లో గుంతలు తవ్వడం సరైన పద్ధతి కాదని సాగుదారులు మండిపడుతున్నారు&period; సర్వే నెంబర్ 793 లోని భూములకు కొన్ని ఏళ్ళ క్రితం పట్టాలు ఇచ్చారని రైతులు తెలిపారు&period; కల్టివేషన్ అయి మూడు నాలుగు సంవత్సరాలు అయిందని&comma; ఆర్ ఓఎఫ్ ఆర్ లో తమకు పట్టాలు ఉన్నాయన్నారు&period; పట్టాలు ఉన్న భూముల్లో ఎందుకు కందకాలు తీస్తున్నారని రైతులు అటవీ అధికారులను ప్రశ్నించారు&period; అడవి ప్రాంతంలో శాటిలైట్ ప్రకారం గుంతలు తీస్తున్న క్రమంలో ఒక మహిళ తమ భూమిలో ఎందుకు గుంతలు తీస్తున్నారని ఆరోపిస్తూ జెసిబిపై రాళ్లదాడికి పాల్పడినట్లు FRO వీరేష్ తెలిపారు&period; దీంతో ఆ మహిళపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్