11 మందిని హత్య చేసిన నరరూప రాక్షసుడిని నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన రామాటీ సత్యనారాయణ అనే హంతకుడు గుప్త నిధుల కోసం మంత్రాలు చేస్తానంటూ ఆస్తులు రాయించుకుని, డబ్బులు తీసుకొని వారిని హత్యలు చేశాడు. నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులు ఈ నిందితుడిని అరెస్టు చేసి డీఐజీ ,ఎల్ఎస్ చౌహన్ ఆధ్వర్యంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ నిందితుడి పేరు రామటి సత్యనారాయణ అలియాస్ సత్యం యాదవ్ (47) సంవత్సరాలు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం తో పాటు నాటు వైద్యం చేస్తూ అలాగే గుప్త నిధులు కోసం కూడా మంత్రాల చేసి తీస్తానంటూ చలామణి అవుతున్నాడు. గుప్తనిధుల తీయడానికి తన వద్దకు మంత్రాల కోసం వచ్చిన వారిని తను వశపరచుకొని వారి వద్ద నుంచి డబ్బులు, అలాగే ప్లాట్లు, భూములు తన పేరు మీదికి రిజిస్ట్రేషన్ చేయించుకునే వాడు. ఇక తీర గుప్తనిధులు తీసే ప్రదేశంలో మంత్రాలు నిర్వహించి ఆ సమయంలో తీర్థ ప్రసాదాలు అంటూ గన్నేరు పప్పు నూరిన విషయాన్ని తీర్థంలో కలిపి బాధితులకు ఇచ్చేవాడు. ఇలా తీసుకున్న తీర్థాన్ని సేవించిన వారు అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందే వారు. మరికొందరిని బండరాళ్లతో కొట్టి చంపాడు ఈ నరరూప హంతకుడు. ఇలా నాగర్ కర్నూల్, కొల్లాపూర్, వనపర్తి, కల్వకుర్తి అనంతపూర్ కర్ణాటక ప్రాంతాలలో 11 హత్యలు చేసినట్లు పోలీసులు ప్రస్తుత విచారణలో తేలింది.
1,2020 సంవత్సరంలో వనపర్తి జిల్లాలో నలుగురి హత్య కేసులో ఇతడు నిందితుడు.
2,, 2021 సంవత్సరంలో నాగర్ కర్నూల్ జిల్లాలో ఇద్దరినీ.
3) 2022 నాగర్కర్నూల్ జిల్లాలో సంవత్సరంలో ఒక్కరిని.
4) 2023 సంవత్సరంలో నలుగురిని హత్య చేశాడు ఈ నిందితుడు.
నాగర్ కర్నూలు జిల్లాలో వనపర్తి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మిస్సింగ్ కేసు దర్యాప్తులో భాగంగా తీగ లాగితే డొంక కదిలినట్లు ఈ సైకో కిల్లర్ ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఇవే కాక మరికొన్ని మిస్సింగ్ కేసులో హత్య కేసులో ఇతని పాత్ర పై పోలీసులు విచారణ చేస్తామన్నారు. కోర్టులో న్యాయమూర్తి ద్వారా అనుమతి తీసుకొని మరికొన్ని కేసులలో దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని డిఐజి ఎల్ ఎస్ చౌహన్, నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మీడియా ముందు నేడు నిందితున్ని ప్రవేశపెట్టి కేసు వివరాలను తెలియజేశారు. ఈ కేసులో దర్యాప్తు చేసిన నాగర్కర్నూల్ సిఐ, ఎస్ఐ, జిల్లా పోలీస్ బృందాన్ని డిఐజి అభినందించారు. వారికి రివార్డు అందేలా కృషి చేస్తామన్నారు.
11 మందిని హత్య చేసిన నరరూప రాక్షసుడు..
71
previous post