59
తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ రాయలసీమలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాలమహానాడు రాయలసీమ అధ్యక్షుడు రంగన్న ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఎస్సీ వర్గీకరణ చేస్తే మాలలు నష్టపోతారనితెలిసి కూడా మాల, మాదిగలను విడదీసి ఓటు బ్యాంకు ను చీల్చాలని మోడీ చూస్తున్నారని ఆగ్రహ్ం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ చేస్తే మోడీకి ఇవే అంతిమ గడియలని, ఎస్సీ వర్గీకరణ అంటూ మోడీ చేస్తే దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.