జనసేన పార్టీలో పొకల మల్లికార్జున్ చేరికతో తిరుపతి జనసేనలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ సాయంత్రం తిరుపతిలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలవాలను వేసి నివాళులు అర్పించి అక్కడి నుంచి నాలుగు కాళ్ల మండపం వరకు పోకల మల్లికార్జున్ తన అనుచరులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలో జనసేన అభ్యర్థి ఆరని శ్రీనివాసులు కు మద్దతు ఇచ్చి అత్యధిక మెజారిటీతో జనసేన అభ్యర్థిని గెలిపించుకోవాలని అలాగే తిరుపతిని జనసేన కంచుకోటగా మార్చు కోవాలని పిలుపునిచ్చారు. ఈ ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, జనసేన బిజెపి టిడిపి కూటమి లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణ ఆంధ్ర ప్రదేశ్ గా మార్చే సత్తా చంద్రబాబు నాయుడుకి ఉందని కావున కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని జనసేన నాయకులు పోకల మల్లికార్జున్ పిలుపునిచ్చారు.
Rally
శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం MLA సీటు జనసేన పార్టీకే కేటాయించాలని జన సైనికులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ధర్మవరం జనసేన పార్టీ ఇంచార్జ్ చిలకం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు జనసేన వీర మహిళలు కలిసి ధర్మవరం ఎమ్మెల్యే సీటు చిలకం మధుసూదన్ రెడ్డి జనసేన పార్టీకే ఇవ్వాలంటూ నినాదాలు చేస్తూ ధర్మవరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. గత ఐదు సంవత్సరాలుగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో సేవ్ ధర్మవరం టు ప్రతిరోజు ప్రజల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న జనసేన పార్టీ నాయకులు ధర్మవరం ప్రజల సమస్యలు తెలిసిన చేనేత సమస్యలు తెలిసిన స్థానికుడైన చిలకం మధుసూదన్ రెడ్డి కి బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయించాలి. మా నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్న వాటికి అనుకూలంగా పార్టీలకు సేవ చేస్తామని ధర్మవరం జనసేన పార్టీ ఇంచార్జ్ చిలకం మధుసూదన్ రెడ్డి అన్నారు.
Siddipet District :
ఢిల్లీలో జరుగుతున్న రైతుల దీక్షకు సంఘీభావంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జేఎసి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ప్రదర్శన చేపట్టారు. రైతుల దీక్షను అణచివేసే ధోరణిని కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని నినాదాలు చేశారు. 22 రకాల పంటలకు కనీస మద్దతు ధర, వ్యవసాయ కార్మికులకు, రైతులకు పెన్షన్లు, రెండు పంటలు పండే వ్యవసాయ భూములను కార్పోరేట్ సంస్థలకు అప్పగించకుండా ఉండాలనే ప్రధాన డిమాండ్లతో ఢిల్లీలో రైతులు చేస్తున్న దీక్షకు జేఏసీ రైతు సంఘాల నాయకులు సంపూర్ణ మద్దతును ప్రకటించారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
గతంలో 13 నెలల పాటు రైతులు చేసిన దీక్షలో పాల్గొన్న అనేక మంది రైతులపై కేసులు పెట్టారని, సుమారు 700 మంది రైతులు చనిపోయారని కనీసం ఆ కేసులను కొట్టివేసి, చనిపోయిన రైతుల కుటుంబాలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆదుకున్న పాపాన పోలేదన్నారు. ఢిల్లీ సమీపంలో రైతులు చేస్తున్న దీక్షను అణిచివేయడానికి వారి పైన టియర్ గ్యాస్, సోనార్ వ్యవస్థను ప్రయోగించడం దారుణమన్నారు. స్వామినాథన్ సిఫార్సులను అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఆయనకు భారతరత్న ఇచ్చి ఆయన ఆశయలకు తూట్లు పొడుస్తోందని మండి పడ్డారు. వెంటనే మోడీ ప్రభుత్వం రైతుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే రానున్న రోజుల్లో రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.
అన్నమయ్య జిల్లా.. రాయచోటిని ప్రమాద రహిత రహదారులుగా తిర్చిదిద్దడమే లక్ష్యంగా రవాణా శాఖ, పొలిసు శాఖ పని చేస్తుందని అర్బన్ సి ఐ సుధాకర్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ మహబూబ్ బాషా, మోటారు వాహనాల తనిఖి అధికారి అనిల్ కుమార్ లు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రవాణా శాఖ ఆదేశాలు మేరకు గత నెల జనవరి 20 నుండి 19 వరకు 35 వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. అందులో బాగంగా రాయచోటి మోటారు వాహనాల తనిఖి అధికారి అనిల్ కుమార్ అద్వర్యంలో చెక్ పోస్ట్ శివనంది సర్కిల్ నుండి ద్విచక్ర వాహనదారులతో బారిగా అవగాహనా ర్యాలి నిర్వహించారు. ఈ ర్యాలిలో అర్బన్ సి ఐ సుధాకర్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ మహబూబ్ బాషా లు పాల్గొని జెండా ఉపి ర్యాలీని ప్రారంబించారు. ఈ ర్యాలి చెక్ పోస్ట్ శివనంది సర్కిల్ నుండి యస్ యన్ కాలనీ మీదగా నేతాజీ కూడలి వరకు కొనసాగించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా నే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఈ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ భద్రతా మాసోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా గడిచిన ఏడాది సుమారు 699 రోడ్డు ప్రమాదాలు జరిగాయని అందులో 365 మంది ప్రాణాలు కోల్పోయ్యారని, 912 గాయాలు పాలైనట్లు వారు వెల్లడించారు. రోడ్డు పై వాహానాలు నడిపి ప్రతి డ్రైవర్ కుడా లైసెన్స్ లతో ఇతర డాక్యుమెంట్ లు తప్పని సరిగా పెట్టుకోవలన్నారు. ప్రతి కుటుంబం రోడ్డు భద్రతా నియమాల పై అవగాహన కలిగి వుండాలని వారు కోరారు. పాదచారులు కుడా రోడ్డు దాటుతున్న సమయంలో వాహనాల రాకపోకలను తప్పని సరిగా గుర్తించి రోడ్డు దాటాలన్నారు. మదనపల్లె రోడ్డు లో ఎక్కువగా ప్రమాదాలు జరిగేవని పొలిసులు ఆ రహదారిలో స్పీడ్ బ్రేకర్ లు ఏర్పాటు చేయడం తో రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించ గలిగామన్నారు. ఈ ర్యాలిలో డ్రైవింగ్ స్కూల్, షో రూమ్ ల యాజమాన్యం, తో పాటు ద్విచక్ర వాహనదారులు, యం వి ఐ సిబ్బంది, పొలిసు సిబ్బంది పాల్గొన్నారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజయరామరాజు పేర్కొన్నారు. 14 వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కడప నగరంలోని కోటిరెడ్డి సర్కిల్లో అవగాహన ర్యాలీనీ జెండా ఊపి ప్రారంభించిన సందర్బంగా ఆయన తెలిపారు. ఇప్పటికే అన్ని పార్టీల రాజకీయ నాయకులతో ఎన్నికలకు సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన చెప్పారు. అవగాహన ర్యాలీ కోటి రెడ్డి సర్కిల్, సంధ్య సర్కిల్ మీదుగా కొనసాగింది. అనంతరం మహావీర్ సర్కిల్ లో మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గణేష్, మున్సిపల్ కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్, ఆర్డీవో మధుసూధన్, కడప తహశీల్దార్ శివ రామిరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
కంచికచర్ల మండలం పరిటాల ఆంజనేయ స్వామి విగ్రహం నుండి పెండ్యాల గ్రామం వరకు వైకాపా శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ పాల్గొన్నారు. పెండ్యాల గ్రామంలో మంచినీటి ట్యాంకు, సిసి రోడ్డును ఎంపీ కేశినేని నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ రాజకీయాలు అనేవి మనం స్వచ్ఛంగా చేయాలని, ఈ ప్రాంతంలో నాకు ఓటేసారు అంటే ఈ ప్రాంత అభివృద్ధి కోసం పని చేయాలని అన్నారు. కేశినేని చిన్ని, బుద్ధ వెంకన్నను ఉద్దేశిస్తూ నా స్థాయికి తక్కువ గల మనుషుల గురించి నేను మాట్లాడను. చీటర్స్ గురించి, బ్రోతల్ హౌసులు నడిపే వారి గురించి, కాల్ మనీ చేసే వారి గురించి మీరు మీడియాలో అనవసరంగా మాట్లాడించి పెద్దోళ్ళని చేస్తున్నారు. దయచేసి వారి గురించి నేను మాట్లాడి నా స్థాయి తగ్గించుకోలేనని ఆయన అన్నారు. నా స్థాయికి చంద్రబాబు గురించి అడిగితే చెప్తా, లోకేష కూడా నా స్థాయికి తక్కువేనని అన్నారు. కొంతమంది పాపులారిటీ కోసం నా మీద మాట్లాడతారని, ఎలక్షన్ అయ్యాక బాక్సులు తెరిచాక ఎవరి పార్టీ ఖాళీ అవుతుందో తెలుస్తుంది వారి గురించి మాట్లాడి నా స్థాయి తగ్గించవద్దని ఆయన అన్నారు. త్వరలో నా అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి వైకాపా పార్టీలోకి ఆహ్వానిస్తాను ఎవరిని బలవంతం చేయను. ముఖ్యమంత్రిగా జగన్ గారు పిలవగానే ఆయన మాట కాదనలేక జాయిన్ అయ్యాను త్వరలో మా అనుచరులతో సమావేశం అవుతానని అన్నారు. నందిగామ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని ఆయన అన్నారు. నందిగామ పట్టణాన్ని కూడా విజయవాడ పట్టణానికి ధీటుగా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.
తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ రాయలసీమలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాలమహానాడు రాయలసీమ అధ్యక్షుడు రంగన్న ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఎస్సీ వర్గీకరణ చేస్తే మాలలు నష్టపోతారనితెలిసి కూడా మాల, మాదిగలను విడదీసి ఓటు బ్యాంకు ను చీల్చాలని మోడీ చూస్తున్నారని ఆగ్రహ్ం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ చేస్తే మోడీకి ఇవే అంతిమ గడియలని, ఎస్సీ వర్గీకరణ అంటూ మోడీ చేస్తే దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.
జనసంద్రంగా మారిన ఎల్బీనగర్ నియోజకవర్గం నామినేషన్ ప్రక్రియ చివరి రోజు కావడంతో ఎల్బీనగర్ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి సామ రంగారెడ్డిహయాత్ నగర్ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వాదం తీసుకుని నామినేషన్ వేయడానికి భారీ ర్యాలీతో వెళ్లడం జరిగింది ఈ ర్యాలీ హయత్ నగర్ మొదలుకొని సరూర్నగర్ జిహెచ్ఎంసి ఆఫీస్ వరకు వెళ్లడం జరిగింది సుమారుగా 20000 మందితో ర్యాలీ తీయడం జరిగింది 10 కిలోమీటర్ల మేర భారీగా వాహనాలు స్తంభించి వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ చూసినా జైశ్రీరామ్ అనే నినాదాలతో ఎల్బీనగర్ దద్దరిల్లిపోయింది. ఈ ర్యాలీని చూసిన జనాలు భారీ మెజార్టీతో బిజెపి అభ్యర్థి గెలవడం ఖాయం అని చెప్తున్నారు. నియోజకవర్గంలో 11 డివిజన్ల కార్పొరేటర్ల గాను ghmc ఎన్నికల్లో 11 డివిజన్లు బిజెపి కైవసం చేసుకోవడం జరిగింది .కావున ఇప్పుడు కూడా బిజెపి అభ్యర్థి 11 డివిజన్లలోను బారి మెజార్టీతో గెలిచి ఎల్బీనగర్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకుంటారని ఇంటలిజెన్స్ వర్గాల నివేదిక.
Read Also..
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం నియోజవర్గంలో భారీ స్థాయిలో వైయస్సార్ రైతు రథం యాత్ర. వైయస్సార్ రైతు భరోసా రెండోవ విడత కార్యక్రమాన్ని పురస్కరించుకొని భారీగా ట్రాక్టర్ ర్యాలి నిర్వహించిన రైతులు. గాడాల గ్రామం నుండి శ్రీరంగపట్నం గ్రామం వరకు కొనసాగిన ర్యాలీ ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు జక్కంపూడి రాజాపాల్గొని స్వయంగా ట్రాక్టర్ నడిపారు. ర్యాలీ అనంతరం శ్రీరంగపట్నంలో వైయస్ఆర్ రైతు భరోసా -పి ఎం కిసాన్ 2వ విడత పంపిణీ కార్యాలయం కి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాధవిలత, జేసీ తేజ్ భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా,డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
Read Also..
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి ర్యాలీ నిర్వహించి ప్రచారం లో పాల్గొన్నారు. ఈ సారి తనకు అవకాశం ఇవ్వాలని బీజేపీ అభ్యర్థి ఆచారి కోరడం జరిగింది నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి పట్టణ కేంద్రంలో మొదట పెద్ద ఎత్తున కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు అనంతరం ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా అన్ని పార్టీలకు అవకాశం కల్పించారు బిజెపి పార్టీ కూడా ఒక్కసారి అవకాశం కల్పిస్తే నియోజకవర్గానికి అభివృద్ధి పథకంలో తీసుకు వెళ్తానని కేంద్రంలో తప్పనిసరిగా నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తారని తనను గెలిపిస్తే కేంద్ర నిధులు తీసుకువచ్చి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తానని బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు కల్వకుర్తి పట్టణంలోని పలు వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓటర్లను కలిసి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయవలసిందిగా వేడుకున్నారు పలువురు బిజెపి పార్టీ నాయకులు పాల్గొన్నారు.