దేశంలో మళ్లీ కలవరపెడుతునన్న కొత్త కరోనా

new corona

Advertisements

&NewLine;<p>కరోనా గురించి యావత్ ప్రపంచం మరిచిపోతున్న తరుణంలో మళ్లీ కరోనా భూతం బెంబేలెత్తిస్తోంది&period; కరోనా కొత్త వేరియంట్ జేఎన్&period;1 కలవరపెడుతోంది&period; మన దేశంలో కూడా కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి&period; దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 358 కొత్త కేసులు నమోదయ్యాయి&period; ఇదే సమయంలో కరోనా కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు&period; ఈ మూడు మరణాలు కూడా కేరళలో సంభవించాయి&period; కొవిడ్ సబ్ వేరియంట్ జేఎన్&period;1ను తొలుత కేరళలో గుర్తించారు&period; తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే గత 24 గంటల్లో కొత్తగా 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి&period; ఈ కేసులన్నీ హైదరాబాద్ లోనే నమోదు కావడం గమనార్హం&period; ప్రస్తుతం 14 మంది కొవిడ్ చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది&period; ఏపీలో కూడా కొత్త వేరియంట్ కేసులు నమోదయినట్టు సమాచారం&period; కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో&comma; కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది&period; కరోనా కట్టడికి అన్ని చర్యలను చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు&comma; కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది&period; ఇప్పటికే పలు రాష్ట్రాలు మాస్క్ లు ధరించాలని ప్రజలకు సూచించాయి&period; వృద్ధులు&comma; గర్భిణులు చిన్నారులు&comma; వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడే వారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు&period; గుంపుగా ఉన్న వారి వద్దకు వెళ్లకుండా ఉండటమే మంచిదని అంటున్నారు&period; చేతులు శుభ్రంగా కడుక్కోవడంతో పాటు శానిటైజర్‌ అందుబాటులో ఉంచుకోవాలి&period; జ్వరం తగ్గకపోవవడం&comma; విపరీతమైన దగ్గు&comma; జలుబు&comma; ముక్కు నుంచి నీరు కారడం ఊపిరి సరిగా ఆడకపోవడం తదితర సమస్యలను ఎదుర్కొంటున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి&period; పోషక విలువలు గల వేడి ఆహారాన్ని తీసుకోవాలి&period; చిన్న పిల్లలు&comma; వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలి&period; తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఫీవర్‌ ఆస్పత్రికి వచ్చి వైద్యులను సంప్రదించి మెరుగైన వైద్యం పొందవచ్చు&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.