71
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆమె కళ్లు తిరిగి పడిపోయారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలలో ఓపెన్ టాప్ వాహనంలో ప్రచారం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిలబడటానికి ఆమె చాలా ఇబ్బంది పడ్డారు. ఛాతీ భాగాన్ని కూడా రెండు, మూడు సార్లు నొక్కుకున్నారు. అనంతరం ఆమె వాహనంపై పడిపోయారు. వాహనంపైనే ఆమెను పడుకోబెట్టి సపర్యలు చేశారు. కవిత పడిపోవడంతో అక్కడున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కాసేపటికి ఆమె కోలుకున్నారు. అయితే, ఆమె డీహైడ్రేషన్ తో అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది.
Read Also..
Read Also..