లావా బ్లేజ్ 2 5G భారతదేశంలో లాంచ్ అయ్యింది. ఇది కంపెనీ తాజా బడ్జెట్ 5G ఫోన్. కంపెనీ లావా బ్లేజ్ 2 5Gని గత సంవత్సరం Blaze 5Gకి అప్‌గ్రేడ్‌గా లాంచ్ చేసింది. ఇది సెగ్మెంట్ ఫస్ట్ రింగ్ లైట్‌ని కలిగి ఉంది. మరి ఈ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో తెలుసుకుందాం. లావా బ్లేజ్ 2 5G 4GB + 64GB వేరియంట్ ధర రూ.9,999. అయితే 6GB + 128GB వేరియంట్ ధర ఇంకా వెల్లడి కాలేదు. ఇది గ్లాస్ బ్లాక్, గ్లాస్ బ్లూ, గ్లాస్ లావెండర్ కలర్ ఆప్షన్లలో ఇండియాలో లాంచ్ అయ్యింది. నవంబర్ 9 నుంచి ఈ ఫోన్ లావా ఇ-స్టోర్, అమెజాన్‌లో అందుబాటులో ఉంది. లావా బ్లేజ్ 2 5G ఫీచర్ల గురించి మాట్లాడితే, డ్యూయల్ సిమ్ (నానో) సపోర్ట్ ఉన్న స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13లో నడుస్తుంది. ఫోన్‌కు ఆండ్రాయిడ్ 14 అప్డేట్ కూడా వస్తుందని కంపెనీ ధృవీకరించింది. ఇవే కాకుండా, రెండు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్డేట్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.56 అంగుళాల HD+ (720×1,600 పిక్సెల్‌లు) డిస్ప్లేను కలిగి ఉంది. లావా ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌తో పాటు 6GB RAMతో పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో వర్చువల్ ర్యామ్‌కు కూడా సపోర్ట్ ఉంది. అందువల్ల RAMను 12GB వరకు పెంచవచ్చు. ఫొటోగ్రఫీ కోసం, ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా, 0.08MP సెకండరీ కెమెరా ఉన్నాయి. ఫోన్ ముందు భాగంలో సెల్ఫీల కోసం 8MP కెమెరా ఉంది. ఫోన్ ఇంటర్నల్ మెమరీ 128 GB, దీనిని కార్డ్ సహాయంతో 1TB వరకు విస్తరించవచ్చు. లావా బ్లేజ్ 2 5G యొక్క బ్యాటరీ 5000mAh ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ కూడా ఇచ్చారు.
రూ.10వేలలో పవర్ఫుల్ 5G ఫోన్..
66
previous post