విద్యుత్ తీగల ఉచ్చులో చిక్కుకొని గొర్రెల కాపరి మృతి..

Shepherd dies

Advertisements

&NewLine;<p>పుట్టపర్తి నియోజకవర్గం ఓడి చెరువు మండల పరిధిలోని తూవంకపల్లి గ్రామానికి చెందిన పాలిమినేని నంజప్ప నాయుడు &lpar;50&rpar; అడవి పందుల కేసిన ఉచ్చులో చిక్కుకొని తీవ్ర విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాడు&period; ఏఎస్ఐ కిషోర్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు గత రాత్రి తూవంకపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో స్వయంగా అతనే అడవి పందులు పట్టుకోడానికి&period;&period; పెద్ద లైను అయిన 11&sol;33&period;&period; విద్యుత్తు లైనులకు తాను తయారు చేసుకున్న&comma; ఉచ్చు తీగలను అమర్చాడు&period; ఉదయం ఏవైనా అడవి పందులు ఉచ్చులో చిక్కుకున్నాయని పరిశీలించాడానికి వెళ్లిన సమయంలో సదరు గొర్రెల కాపరి నంజపునాయుడే ఆ ఉచ్చులో చిక్కుకొని తీవ్ర విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు&period; గొర్రెల కాపరి నంజప్పకు భార్య&comma; కుమార్తె&comma; కుమారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు&period; గ్రామస్తుల సమక్షంలో శవ పంచనామా నిర్వహించి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><br><&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.