నంద్యాలలో బొమ్మల సత్రంలోని సి పి ఆర్ గ్రాండ్ లాడ్జిలో అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్లు కలిసి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులందరం వైసిపి ప్రభుత్వానికి సపోర్ట్ చేశామని కానీ ప్రభుత్వం తమని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు వైసిపి ప్రభుత్వం 10% కూడా న్యాయం చేయలేదని, 1150 కోట్ల రూపాయలు బాధితులందరికీ ఇస్తుందని వైసీపీ ప్రభుత్వం మాట చెప్పి 250 కోట్ల మాత్రమే బాధితులకు పంచారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి మాట తప్పారని ఎద్దేవా చేశారు. అగ్రిగోల్డ్ బాధితులందరికీ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తిరిగి ఇవ్వని పక్షంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో అగ్రిగోల్డ్ బాధితుల తరఫున పోటీ చేస్తామని, సమస్యలను పరిష్కరించకపోతే వైసీపీ ప్రభుత్వం ఓట్లు చీల్చి ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు. సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితుల తరఫున అగ్రిగోల్డ్ బాధితుల సంఘం సెక్రటరీ అయిన బచ్చు శ్రావణ కుమారును నంద్యాల అసెంబ్లీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షుడు ఆదాం సాహెబ్, గౌరవ అధ్యక్షులు మనోహర్ రాజు తెలిపారు.
అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మీయ సమావేశం…
66
previous post