ఆస్ట్రేలియాలో ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఓ తెలుగు వైద్యురాలు ప్రమాదవశాత్తూ కాలు జారడంతో కింద పడి దుర్మరణం చెందారు. కృష్ణా జిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో గల బాండ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఉజ్వల తల్లిదండ్రులు వేమూరు మైథిలి, వెంకటేశ్వరరావు కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలోనే స్థిర పడ్డారు. ఈ నెల 2వ తేదీన సరదాగా తోటి స్నేహితులతో కలిసి ఉజ్వల ట్రెక్కింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ కాలు జారడంతో లోయలో పడి దుర్మరణం చెందారు. జీవితంలో ఉన్నత స్థితికి వెళుతుందనుకున్న ఉజ్వల ఇలా ఊహించని విధంగా దూరమవడం ఆమె కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కాగా, ఉజ్వల అంత్యక్రియల నిమిత్తం ఆమె భౌతిక కాయాన్ని ఉంగుటూరు మండలం ఎలుకపాడులోని అమ్మమ్మ, తాతయ్యల ఇంటికి తీసుకొస్తున్నారు.
లోయలో పడి తెలుగు వైద్యురాలు మృతి…
86
previous post