సాగర్ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా యానాం విచ్చేసిన కేంద్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి పర్షోత్తమ్ రూపాలా, కేంద్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ సహాయమంత్రి ఎల్.మురుగన్ బృందం యానాంలో పర్యటించారు. వారికి యానాంలో ఘన స్వాగతం లభించింది. యానాం పరిపాలనాధికారి కార్యాలయం వద్ద వారు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సావిత్రి నగర్ ఫిషింగ్ హార్బర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మురుగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మత్స్యకార నాయకులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఒ.ఎన్.జి.సి నష్టపరిహారం, డీజిల్ సబ్సిడీ, ఆక్వారంగానికి విద్యుత్ సబ్సిడీ, మూసుకుపోయిన మొగలో ఇసుకమేటలను తొలగించాలని మత్స్యకార నాయకులు మంత్రిని కోరారు. సమస్యలను విన్న కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. యానాం మత్స్యకారుల సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి పర్షోత్తమ్ రూపాలా మాట్లాడుతూ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సాగర పరిక్రమ యాత్రలో భాగంగా మత్సకారుల సమస్యలను పరిష్కరించేందుకు ఏడు వేల కిలోమీటర్ల పర్యటించానని అన్నారు. మంత్రి మురుగన్ మాట్లాడుతూ.. మత్సకారుల జీవన ప్రమాణం పెరగాలని, ఆర్దికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. అందుకు కేంద్ర ప్రభుత్వం పలు పధకాలను ప్రవేశపెట్టిందని, ఆ పథకాలు గ్రామ స్దాయిలో ఉండే ప్రతీ ఒక్కరికి అందచేసేందుకు సాగర పరిక్రమ యాత్ర చేపట్టినట్లుగా తెలియజేసారు. స్దానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస అశోక్ మాట్లాడుతూ.. యానాం మత్సకారులకు ఓ.ఎన్.జి.సి పరిహారం అందజేయడంలో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే అంటూ, దానికి కారణం నాలుగు రోజులలో అందరిముందు బయటపెడతానని సభాముఖంగా తెలియజేసారు.
కేంద్ర మంత్రుల బృందానికి ఘన స్వాగతం..
82
previous post