ఆర్టికల్ 370 రద్దు…

Abolition of Article 370...

Advertisements

&NewLine;<p>జమ్మూకాశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ను రద్దు చేయడంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది&period; భారత దేశంలో కలిసినపుడు కాశ్మీర్ కు ప్రత్యేక సార్వభౌమత్వం లేదని వ్యాఖ్యానించింది&period; అప్పట్లో జమ్మూకాశ్మీర్ లో ఉన్న పరిస్థితులు&comma; యుద్ధ వాతావరణం కారణంగానే ఆర్టికల్ 370 ని ఏర్పాటు చేశారని పేర్కొంది&period; ఈ ఆర్టికల్ ఏర్పాటు తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదని తేల్చిచెప్పింది&period; ఈమేరకు ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చదివి వినిపించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఆర్టికల్ 370 రద్దుపై దాఖలైన పిటిషన్లను విచారించిన రాజ్యాంగ ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని సీజేఐ తెలిపారు&period; ఈ ధర్మాసనంలో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తో పాటు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్&comma; జస్టిస్ సంజీవ్ ఖన్నా&comma; జస్టిస్ బీఆర్ గవాయ్&comma; జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు&period; ఆర్టికల్ 370 రద్దు కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని&comma; దీనిపై రాష్ట్రపతి ప్రకటన చేశారని ధర్మాసనం గుర్తుచేసింది&period; పార్లమెంట్ నిర్ణయాన్ని&comma; రాష్ట్రపతి ప్రకటనను కొట్టిపారేయలేమని తేల్చి చెప్పింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దేశంలోని మిగతా రాష్ట్రాలు&comma; కేంద్ర పాలిత ప్రాంతాలతో కాశ్మీర్ కూడా సమానమేనని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది&period; మిగతా రాష్ట్రాలకు లేని ప్రత్యేక ప్రతిపత్తి కాశ్మీర్ కు మాత్రమే ఉండదని&comma; ఆర్టికల్ 370 నాటి పరిస్థితుల దృష్ట్యా చేసిన తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని పేర్కొంది&period; 2024 సెప్టెంబర్ 30 లోపు జమ్మూకశ్మీర్&comma; లడఖ్ లలో ఎన్నికలు నిర్వహించాలని భారత ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు సూచించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.