సకల శుభకరం క్షీరాబ్ది ద్వాదశి

Ksheerabdi Dwadashi

Advertisements

&NewLine;<p>మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తీకం&period; అందులోనూ అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశిగా పిలువబడే కార్తీక శుక్లపక్ష ద్వాదశి&period; శివకేశవులిద్దరికీ అత్యంత ప్రీతిపాత్రమైన రోజు&period; మందర పర్వతం కవ్వంగా&comma; వాసుకి తాడుగా క్షీర సముద్రాన్ని దేవదానవులు మథించిన రోజు ఇది&period; అందుకే దీన్ని &OpenCurlyQuote;క్షీరాబ్ది ద్వాదశి’ అన్నారు&period; మథించడం అంటే చిలకడం&period; కాబట్టి &OpenCurlyQuote;చిలుకు ద్వాదశి’గా కూడా వ్యవహరిస్తారు&period; అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మథించిన పర్వదినం&period; క్షీరాబ్ది ద్వాదశి రోజున దీపావళి రోజు వలె లక్ష్మీదేవిని నాణాలతో పూజిస్తే శ్రీమహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది&period; ఎల్లవేళలా క్షీర సాగరంలో శేషశయ్యపై శయనించి ఉండే విష్ణుమూర్తి ఈ రోజు బ్రహ్మాది దేవతలతో బృందావానికి వస్తాడని&comma; అందువల్ల బృం దావనంలో ఎవరు శ్రద్ధాసక్తులతో విష్ణుపూజ చేస్తారో వారికి ఆయురారోగ్యాలు&comma; సిరిసంపద లు సిద్ధిస్తాయని పురాణ కథనం&period; పలు విశేషాల సమాహారం అయిన క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి&comma; యోగీశ్వర ద్వాదశి అనే పేర్లు కూడా ఉన్నాయి&period; అత్యంత పుణ్యప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని&comma; అలాగే యోగులు&comma; మునులు తమ చాతుర్మాస దీక్షను విరమించే పవిత్ర తిథి కాబట్టి యోగీశ్వర ద్వాదశిగానూ ప్రాచుర్యం పొందింది&period; స్వాయంభువ మన్వాది సంవత్సరాలను క్షీరాబ్ది ద్వాదశి రోజు నుంచి లెక్కిస్తారు&period; ఏకా దశి నుంచి పూర్ణిమ వరకూ &OpenCurlyQuote;భీష్మ పంచక వ్రతం’ అని శాస్త్రాలు చెబుతున్నాయి&period; మరణశ య్యపై ఉన్న పితామహుడు భీష్ముని దాహార్తి తీర్చడానికి అర్జునుడు తన బాణంతో పాతాళ గంగను పైకి రప్పించినది ఈ రోజునేనని ఇతిహాసాలు పేర్కొంటున్నాయి&period; ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీమహా విష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశినాడు మేల్కొంటాడు&period; మర్నాడు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీ సమేతుడై&comma; బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు కాబట్టి ఆ రోజుని &OpenCurlyQuote;బృందావని ద్వాదశి’గా పిలుస్తారు&period; క్షీరాబ్ది ద్వాదశి నాడు పాల సముద్రంలో మహాలక్ష్మి ఆవిర్భవించిందనీ&comma; ఆ రోజు నే లక్ష్మీ నారాయణుల కల్యాణం జరిగిందనీ &OpenCurlyQuote;చతుర్వర్గ చింతామణి’ అనే గ్రంథం చెబుతోం ది&period; అందుకే ఈ రోజు లక్ష్మీ నారాయణ కల్యాణం నిర్వహంచే సంప్రదాయం ఏర్పడింది&period; విష్ణుమూర్తినీ&comma; మహాలక్ష్మినీ బృందావనానికి బ్రహ్మ తీసుకొని వెళ్ళి&comma; అక్కడ తులసితో విష్ణువుకు వివాహం జరిపించాడని క్షీరాబ్ది వ్రత కథ చెబుతోంది&period; లక్ష్మీదేవిని శ్రీహరి పరిణయ మాడిన శుభ తిథి కారణంగానే క్షీరాబ్ది ద్వాదశి సాయం త్రం ముత్తైదువులు లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించి&comma; శ్రీ మహా విష్ణువు&comma; లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు&period; తులసీని శ్రీలక్ష్మిగానూ&comma; ఉసిరి చెట్టును శ్రీమన్నా రాయణునిగాను భావించి వివా హం జరిపించి పునీతులవుతారు&period; సాయంత్రం దీపాలతో అలంకరిస్తారు&period; సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయకపోతే వచ్చే దోషం&comma; ఈరోజు దీపారాధన చేయడం వల్ల పరిహార మౌతుంది&period; పరమ పవిత్రమైన ఈ రోజును పావన ద్వాదశిగా&comma; విభూతి ద్వాదశిగా&comma; గోవత్స ద్వాదశి గా&comma; నీరాజన ద్వాదశిగా వ్యవహరిస్తూ అందుకు సంబంధించిన వ్రతాలు చేస్తుంటారు&period; తులసి సాక్షాత్తూ లక్ష్మీదేవి అంశే&period;ముఖ్యంగా&comma; మథురలోని బృందావనంలో&comma; మహారాష్ట్రలో క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసీ కల్యాణం నిర్వహస్తారు&period; తెలుగు లోగిళ్ళలో క్షీరాబ్ది ద్వాదశి రోజు సాయంత్రం తులసికోట దగ్గర అలికి&comma; ముగ్గు లు పెడతారు&period; తులసికోటనే బృందావనంగా భావించి&comma; ఉసిరిక కొమ్మను విష్ణుమూర్తికి ప్రతీ కగా భావించి తులసీ కల్యాణం చేస్తారు&period; ఈ కార్యక్రమాన్ని గృహణి లేదా దంపతులు నిర్వహస్తారు&period; రామ తులసి&comma; కృష్ణ తులసి&comma; లక్ష్మీ తులసి ఇలా ఎన్నో రకాల తులసి చెట్లు ఉన్నాయి&period; నల్లని కాండం ఉన్న మొక్కను &OpenCurlyQuote;కృష్ణ తులసి’ అనీ&comma; తెల్లని కాండం ఉండే మొక్కను &OpenCurlyQuote;లక్ష్మీ తులసి’ అనీ అంటారు&period; ఈ రెండు వర్ణాల తులసి వృక్షాలను తులసికోటలో నాటి&comma; పరి ణయం జరిపిస్తారు&period;<br>దశావతారాల్లో ఎనిమిదవది శ్రీకృష్ణావతారం&period; తులసి సన్నిధిలో ఉండడం తనకెంతో ఇష్టమని సాక్షాత్తూ కృష్ణుడే తన సహపాఠి ఉద్ధవునితో చెప్పినట్టు పురాణాలు పేర్కొంటున్నా యి&period; తులసితో కృష్ణునికి ఉన్న అనుబంధమే తులసీ కల్యాణం నిర్వహంచడానికి ముఖ్య కార ణం&period; ఈ కల్యాణం సందర్భంగా తులసిని షోడశోప చారాలతో పూజించి&comma; వివిధ రకాల పండ్లు&comma; చెరుకు ముక్కలు&comma; చలిమిడి&comma; వడపప్పు నివేదించి&comma; హారతి ఇస్తారు&period; ముత్తైదువను శ్రీ మహాలక్ష్మిగా సంభావించి&comma; పసుపు కుంకుమలు&comma; à°«à°² పుష్ప తాంబూలాదులతో సత్కరించి&comma; దీవెనలు పొందుతారు&period; అలా చేస్తే మాంగల్యాభివృద్ధి కలుగుతుందని నమ్మకం&period; రోజంతా ఉపవసించిన గృహణులు పూజానంతరం తులసికి నివేదించిన వాటిని ప్రసాదంగా తీసు కొని&comma; ఉపవాసాన్ని విరమిస్తారు&period; ప్రతిరోజూ ఉభయ సంధ్యలలో దేవుని ముందు దీపాలు వెలిగించడం మన సంస్కృతి లో భాగం&period; అలా పెట్టలేనివారు కార్తీక మాసంలోనైనా పెట్టాలని శాస్త్రాలు అంటున్నాయి&period; అది కూడా చేయలేనివారు ద్వాదశినాడు 360 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తే&comma; సంవత్స రమంతా దీపం వెలిగించినట్టవుతుందని శాస్త్ర వచనం&period; కార్తికమాసం అంతా దీపాలు పెట్టలేని వారు ద్వాదశి&comma; చతుర్దశి&comma; పూర్ణిమ నాడు తప్పకుండా పెట్టాలనీ&comma; అందునా ద్వాదశి నాటి దీపం వైకుంఠ ప్రాప్తి కలిగిస్తుందనీ &OpenCurlyQuote;కార్తిక పురాణం’ చెబుతోంది&period; హందూ సంస్కృతిలో తులసి అతి పవిత్రం&period; తులసీ కృష్ణుల అనుబంధం కూడా అటు వంటిదే&period; తులసికోట లేని ఇల్లంటూ ఉండదు&period; మహళలు తులసిని ప్రతిరోజూ పూజిస్తారు&period; తులసికి నీరు పోసి&comma; దీపం పెట్టి&comma; తులసీ స్తోత్రాన్ని పఠిస్తూ ప్రదక్షిణ చేసి&comma; చివరగా తులసికోట లోని తీర్థాన్నీ&comma; తులసీ దళాన్నీ స్వీకరిస్తారు&period; తులసిని పూజించడం అంటే లక్ష్మిని ఆరాధించడ మే&period; క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి పూజ లక్ష్మీ నారాయణులకు చేసే పూజ&period; ఎంతో ప్రాధా న్యం ఉన్న ఈ ఆరాధన ప్రేమకూ&comma; భక్తికీ&comma; ప్రతీక&period; తులసి తీర్థం&comma; తులసీ దళం మీదుగా వచ్చే గాలి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి&period; తులసిలో రోగనివారక శక్తి ఉందని ఆయుర్వేదం నిరూపించింది&period; చిలుకు ద్వాదశి రోజున అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా తీరాన కాశీక్షేత్రంలో కోటిమందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణ లిఖితం&period; &OpenCurlyQuote;గోవత్స ద్వాదశి’గా పిలిచే ఈ రోజున వత్సంతో అంటే దూడతో కూడిన ఆవును దానం ఇస్తే విశేష ఫలం లభిస్తుందని ఆస్తికుల విశ్వాసం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"0Dwa3AElt3"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;chakratirtha-mukkoti-is-the-largest-in-tirumala&sol;amp&sol;">తిరుమ‌à°²‌లో à°˜à°¨à°‚à°—à°¾ à°šà°•్రతీర్థ à°®à±à°•్కోటి&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;తిరుమ‌à°²‌లో à°˜à°¨à°‚à°—à°¾ à°šà°•్రతీర్థ à°®à±à°•్కోటి&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;chakratirtha-mukkoti-is-the-largest-in-tirumala&sol;embed&sol;&num;&quest;secret&equals;4JsSEqGMXD&num;&quest;secret&equals;0Dwa3AElt3" data-secret&equals;"0Dwa3AElt3" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"rjghAuztZ6"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;kaishika-dwadashi-asthanam&sol;amp&sol;">శ్రీవారి ఆలయంలో ఘనంగా కైశిక ద్వాదశి ఆస్థాన వేడుక&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;శ్రీవారి ఆలయంలో ఘనంగా కైశిక ద్వాదశి ఆస్థాన వేడుక&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;kaishika-dwadashi-asthanam&sol;embed&sol;&num;&quest;secret&equals;oLCPJSXJpj&num;&quest;secret&equals;rjghAuztZ6" data-secret&equals;"rjghAuztZ6" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..