చేసిన అభివృద్ధి అంతా కళ్ళముందే…

Media conference

Advertisements

&NewLine;<p>సామాజిక న్యాయమే తన ఎజెండా అని జగనన్న మరోసారి నిరూపించుకున్నారని జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు&comma; మాజీ డిప్యూటీ సిఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు&period; శుక్రవారం సాయంత్రం నరసన్నపేటలో టెక్కలి&comma; ఇచ్చాపురం నియోజకవర్గ సమన్యయకర్తలు దువ్వాడ శ్రీనివాస్&comma; పిరియా విజయ&comma; శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ లతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు&period; ఈ సందర్భంగా జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎల్లప్పుడూ నా బీసీలు&comma; నా ఎస్సీలు&comma; నా ఎస్టీలు&comma; నా మైనారిటీలు అని అంకితభావంతో వారి సంక్షేమం కోసం తపిస్తున్నారని పేర్కొన్నారు&period; రాజ్యాధికారంలో కూడా వారందరికీ పెద్దపీట వేయాలనే సంకల్పంతోనే ముందుకెళ్తున్నారన్నారు&period; జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు&comma; పార్లమెంటు నియోజకవర్గానికి సమన్వయకర్తలుగా బీసీలనే నియమించి బీసీల పట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నారని తెలిపారు&period; మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఇదేవిధంగా సిఎం జగన్ సామాజిక సమతూకాన్ని పాటించనున్నారన్నారు&period; ఎల్లప్పుడూ బీసీలు&comma; ఎస్సీలు&comma; ఎస్టీలు&comma; మైనార్టీలను ఉపయోగించుకుని అందలాలెక్కే చంద్రబాబునాయుడు తన అవసరం తీరాక వారిని తొక్కేశారన్నారు&period; జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ వారందరికీ న్యాయం జరుగుతుందన్నారు&period; పార్టీ నిర్దేశాలకు అనుగుణంగా కలిసికట్టుగా పనిచేసి శతశాతం ఫలితాలు సాధిస్తామన్నారు&period; సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ నేటి వరకూ ప్రజలకోసం రూ 4 లక్షల కోట్లకు పైగా సంక్షేమ పథకాల కింద ప్రజలకు అందించామన్నారు&period; ప్రతి ఇంటా అభివృద్ధి జరిగిందన్నారు&period; సీఎం జగన్ చేసిన అభివృద్ధి ఏమిటో అంతా కళ్ళముందే అందరికీ కనిపిస్తోందని పేర్కొన్నారు&period; 175 అసెంబ్లీ స్థానాల్లో&comma; 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో కచ్చితంగా వైసీపీ విజయం సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.