కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా ఎన్నికల వేళ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ పొత్తులపై అమిత్ షా స్పందిచారు, త్వరలోనే నిర్ణయాలు ఉంటాయని ఆయన వెల్లడించారు. ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఫ్యామిలీ ప్లానింగ్ కుటుంబ పరంగా బాగుంటుందన్న అమిత్ షా.. రాజకీయ కూటమి ఎంత పెద్దగా ఉంటే అంత మంచిదని వ్యాఖ్యానించారు. రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టి కొందరు కూటమి నుంచి బయటకు వెళ్లి ఉండొచ్చని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఏపీలోని రాజకీయ పరిస్థితులు ఉత్కంఠగా మారాయి. ఇటీవల తెదేపా అధినేత చంద్రబాబు ఢిల్లీలో అమిత్‌షాతో సమావేశమై చర్చలు జరిపారు.
మరిన్నితాజావార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.