రంగారెడ్డి జిల్లా.. చేవెళ్ల నియోజకవర్గంలో విద్యుత్ షాకుతో ఒగ్గు కళాకారుడు మృతి చెందిన సంఘటన షాబాద్ మండల పరిధిలోనే చందనవల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. షాబాద్ ఎస్సై మహేశ్వరరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామానికి చెందిన ఒగ్గు కళాకారుడు శివకుమార్ (29)మృతి చెందాడు. ఇతనికి ఒక బాబు, ఒక పాప ఉన్నట్టు సర్పంచ్ తెలిపారు. ఇతను షాబాద్ మండల పరిధిలోని చందనవెల్లి గ్రామానికి చెందిన కందివనం మహేందర్ గౌడ్ తన ఇంటి వద్ద ఎల్లమ్మ కళ్యాణం నిర్వహించారు. ఒగ్గు కథ కళాకారుడు శివకుమార్ తన బృందంతో మైక్ తో కథ చెప్పేందుకు మౌత్ పీస్ తీసుకోగా దానికి విద్యుత్ షాక్ వచ్చి శివకుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ షాక్ తో ఒగ్గు కళాకారుడు మృతి
71
previous post