కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2024 మధ్యంతర బడ్జెట్ ట్యాక్స్ పేయర్స్ను నిరాశపరిచింది. పన్ను రేట్లకు సంబంధించిన ఎలాంటి ప్రకటనలు ఆర్థిక మంత్రి చేయలేదు. దీంతో పన్ను రేట్లు యథాతథంగా కొనసాగనున్నాయి. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను రాయితీ పరిమితి 7 లక్షలు ఉంది. దీని కారణంగా సంవత్సరానికి 7 లక్షల వరకు సంపాదిస్తున్న వ్యక్తులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే దీన్ని 8 లక్షలకు పెంచుతారని మధ్యతరగతి వర్గాల ప్రజలు భావించారు. కానీ ఎటువంటి ప్రకటనా లేకపోవడంతో నిరాశే మిగిల్చింది.
ఇక పన్ను శ్లాబులకు విషయానికి వస్తే ప్రస్తుత మధ్యంతర బడ్జెట్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో 5 పన్ను శ్లాబులు ఉన్నాయి. ఇవి గతంలో ఆరు శ్లాబులు ఉండగా గతేడాది ఐదుకు తగ్గించారు.
ట్యాక్స్ పేయర్స్ను నిరాశపరిచన మధ్యంతర బడ్జెట్
88
previous post