ఒకే స్టూడియోలో రజినీకాంత్, కమల్ హాసన్ అపూర్వ కలయిక..

Kamal Sir & Rajini Sir_1

Advertisements

&NewLine;<p>ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తమదైన క్రేజ్&comma; ఇమేజ్‌ను సొంతం చేసుకున్న లెజెండ్రీ యాక్టర్స్ సూపర్ స్టార్ రజినీకాంత్&comma; యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్&period; ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో వీరికున్న ఫ్యాన్ ఫాలోయింగ్&comma; మాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు&period; కెరీర్ ప్రారంభంలో వీరిద్దరూ కలిసి సినిమాలు చేసి అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే&period; స్టార్స్‌గా ఎదిగే క్రమంలో ఎవరికీ వారు మైల్ స్టోన్ మూవీస్‌తో ఎవరూ అందనంత గొప్ప స్థాయికి చేరుకున్నారు&period; ప్రస్తుతం వీరిద్దరూ ఒకే స్టూడియోలో తమ సినిమాలకు సంబంధించిన షూటింగ్స్‌లో పాల్గొన్నారు&period; ఒకే స్టూడియోలో ఉన్నామని తెలుసుకున్నవారు ఒకరినొకరు కలుసుకుని గత స్మృతులను నెమరువేసుకున్నారు&period; ఇలా ఒకే స్టూడియోలో వీరిద్దరూ షూటింగ్స్ జరుపుకోవటం&comma; అక్కడే కలుసుకోవటం జరిగి 21 సంవత్సరాలు అయ్యాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్&comma; రెడ్ జెయింట్ మూవీస్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ మూవీ &OpenCurlyQuote;ఇండియన్ 2’&period; ఈ సినిమా షూటింగ్ చెన్నైలోని ప్రసాద్ స్టూడియో ఎరీనాలో జరుగుతోంది&period; దీనికి సమీపంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా జ్ఞానవేల్‌ దర్శకత్వంలో టి&period;జె&period; లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోన్న మరో భారీ బడ్జెట్ చిత్రం &OpenCurlyQuote;తలైవర్ 170’ షూటింగ్ జరుగుతోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తన షూటింగ్ స్పాట్‌కి సమీపంలోనే &OpenCurlyQuote;ఇండియన్‌ 2’ షూటింగ్‌ జరుగుతోందని తెలిసుకున్న రజినీకాంత్&period;&period; తన మిత్రుడు కమల్‌హాసన్‌ని షూటింగ్‌ స్పాట్‌లో కలవటానికి సిద్ధమయ్యారు&period; ఈ విషయం తెలుసుకున్న విశ్వనటుడు కమల్ హాసన్&period;&period; వెంటనే ఉదయం 8 గంటలకే తలైవర్ 170 షూటింగ్ స్పాట్‌కి వెళ్లి &OpenCurlyQuote;నేను నా స్నేహితుడిని కలవడానికి వస్తున్నాను’ అంటూ సూపర్‌స్టార్‌కి సర్‌ప్రైజ్ ఇవ్వటం విశేషం&period; చిరకాల మిత్రుడు కమల్‌హాసన్‌ను చూసి సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆనందం వ్యక్తం చేశారు&period; లెజెండ్రీ యాక్టర్స్ కలుసుకుని వారి గత స్మృతులను గుర్తు చేసుకున్నారు&period; ఇంతకు ముందు బాబా&comma; పంచ తంత్రం షూటింగ్స్ ఒకే చోట జరిగినప్పుడు వారిద్దరూ కలుసుకున్నారు&period; ఇది జరిగి 21 సంవత్సరాలు అవుతున్నాయి&period; ఈ కార్యక్రమంలో లైకా ప్రొడక్షన్స్ హెడ్ జికెఎం తమిళ్ కుమరన్&comma; రెడ్ జెయింట్ మూవీస్ కో ప్రొడ్యూసర్ ఎం&period; సెంబగ మూర్తి పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం..

మే 15న‌ “ముసలోడికి దసరా పండుగ” మూవీ విడుదల..