అనంతపురం(Anantapur) జిల్లా, రాయదుర్గం నియోజకవర్గం
రాయదుర్గం వైసీపీ సమన్వయ కర్త మెట్టు గోవిందరెడ్డి(Mettu Govindareddy) సొంతూరు బొమ్మనహాల్ మండలం ఉంతకల్లుకు చెందిన 65కుటుంబాల వారు శనివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కాలవ శ్రీనివాసులు పసుపు కండువాలతో వారికి స్వాగతం పలికారు. వెనుకబడిన తరగతులకు చెందిన కురుబ, వాల్మీకి సామాజిక వర్గాల వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
వీరితో పాటు అదే మండలం కురువల్లి నుంచి 50మంది, బొమ్మనహాల్ నుంచి 10మంది, ఎల్బీనగర్ నుంచి 5గురు, సిద్ధరాంపురం నుంచి 5గురు టీడీపీ లో చేరడం జరిగింది. ఈ సందర్భంగా మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ, మెట్టు గోవిందరెడ్డి సొంత మండలంగా చెప్పుకునే బొమ్మనహాల్ నుంచే పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు వైసీపీ నుంచి వలస వస్తుండడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ వలసలు మరింత పెరిగి ఆ మండలంలో మెట్టుకు డిపాజిట్ కు సరిపడా ఓట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి