రాష్ట్రంలో అంగన్వాడీల పరిస్థితి దయనీయంగా మారిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశాడు. జీతాలు పెంచక, సంక్షేమంలోనూ కోత పెట్టి జగన్ సర్కారు అంగన్వాడీలపై కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఒక్క చాన్స్ ఇస్తే తెలంగాణ కంటే ఎక్కువ జీతాలు ఇస్తానంటూ అంగన్వాడీలకు ఇచ్చిన హామీని వైఎస్ జగన్ బుట్టదాఖలు చేశారని విమర్శించారు. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను ప్రభుత్వం బెదిరింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. నిరసనలు చేస్తే ఉద్యోగంలో నుంచి తొలగిస్తానని బెదిరించడం జగన్ అధికార దుర్వినియోగానికి నిదర్శనమని చెప్పారు. పొరుగు రాష్ట్రంతో సమానంగా జీతాలిస్తామని హామీ ఇచ్చి ఐదేళ్లు కావొస్తున్నా ఇప్పటికీ అంగన్వాడీల జీతాలు ఎందుకు పెంచలేదని అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని నిలదీశారు. అరకొర జీతంతో అంగన్వాడీలు బతికేదెలా రాజన్న పాలన అంటే ఇదేనా? అంటూ ప్రశ్నించారు.
Read Also..
Read Also..