తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపీ విరామ స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల పోటీకి ముందు శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏపీ ఎన్నికల్లో మరోమారు వైసీపీ పార్టీ గెలిచి సీఎం అవ్వాలని కోరుకున్నట్లు తెలిపారు. జగన్ ను ఎదుర్కోలేక…. పొత్తులు పెట్టుకొని గుంపులుగా వస్తున్నాయన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఒంటరిగా పోటీ చేసి గెలిచిన చరిత్ర చంద్రబాబుకు లేదన్నారు. ఎన్ని పార్టీలు వచ్చిన సీఎం జగన్ ను ఓడించలేరని ధీమా వ్యక్తం చేశారు. పవన్ కేవలం తాను అసెంబ్లీలో అడుగుపెడితే చాలు అనే పరిస్థితిలో ఉన్నారని స్పష్టం చేశారు. 2014లో అనుభవిజ్ఞుడు ఉంటే పరిపాలన సాగుతుందని అప్పట్లో ప్రజలు చంద్రబాబుకు ఓటు వేశారని…. చంద్రబాబు పాలన చూసి విసుగెత్తిన ప్రజలు వైసీపీకి పట్టం గట్టారని తెలిపారు. విశాఖలో అన్ని విధాలా అభివృద్ధి సాధ్యం కాబట్టే పరిపాలన రాజధాని చేయాలని సంకల్పించారన్నారు. మంచి పరిపాలన కోసం జగన్ ను మరోమారు ప్రజలు గెలిపిస్తారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మాకు ఎలాంటి సంబంధం లేదని…జగన్ ను రాజకీయంగా అణగతొక్కాలని చూసిన కాంగ్రెస్ పార్టీతో మేము కలిసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. చంద్రబాబుకు మాత్రమే అన్ని సంధలు ఉంటాయనీ ఎద్దేవా చేశారు.
ఇది చదవండి: ప్రజాగళానికి అంచనాలకు మించి జన సంద్రోహం..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి