నామినేషన్ (Nomination) :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ (Nomination) వేయబోయే రోజును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఈ నెల 25వ తేదీ గురువారం రోజున పులివెందులలో సీఎం జగన్ స్వయంగా నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేస్తారు. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.
ఇది చదవండి : ఎన్నికల ఫిర్యాదుల కొరకు ప్రత్యేక ఫోన్ నంబర్…
అదే విధంగా ఈ నెల 22న సీఎం జగన్ తరుపున వైఎస్ అవినాష్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఏపీలో ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరించే అవకాశం ఉంది. ఏప్రిల్ 26వ తేదీన నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో మంచి ముహూర్తాల కోసం అభ్యర్థులు వేచి చూస్తున్నారు. అలాగే నామినేషన్ల దాఖలుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: సీఎం జగన్ నామినేషన్ ముహూర్తం ఖరారు…