తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబరు 31వ తేదీన దీపావళి ఆస్థానాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. దీపావళి నాడు ఉదయం 7 నుండి ఉదయం 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది.
ఆస్థానంలో భాగంగా శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటుచేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేస్తారు. సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేస్తారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది. కాగా సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానంతిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబరు 31వ తేదీన దీపావళి ఆస్థానాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. దీపావళి నాడు ఉదయం 7 నుండి ఉదయం 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా…
- జీవో నెంబర్ 29ని రద్దు చేయాలన్న బండి సంజయ్జీవో నెంబర్ 29 వెనుక రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర దాగి ఉందని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకే మోడీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెచ్చిందన్నారు. జీవో నెంబర్…
- హరీష్ రావుకు జూపల్లి సవాల్హరీష్ రావుకు జూపల్లి సవాల్ విసిరారు . హారీష్ రావుతో తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఎల్బీ స్టేడియంకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరు వస్తారో డిసైడ్ చేసుకోండని చెప్పారు. తెలంగాణలో జరిగిన అవినీతిపై చర్చించడానికి…
- పోలీసుల అదుపులో బండి సంజయ్కేంద్రమంత్రి బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వాహనంలో ఎక్కించి తరలించారు. దీంతో పోలీసుల వాహనాన్ని గ్రూప్-1 అభ్యర్థులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయినా సరే అభ్యర్థులను చెదరగొడుతూ బండి సంజయ్‌ను పోలీస్…
- కేటీఆర్, హరీశ్ రావులపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్..బీఆర్ఎస్ నేతల ఫామ్ హౌస్ డ్రైనేజీ నీటిని పేదలకు వేళ్లే తాగునీటిలో కలుపుతారా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల తాపత్రయమంతా ఫామ్‌హౌస్‌లు కాపాడుకోవడానికేనని అన్నారు. మూసీ పునరుజ్జీవం వేరు.. హైడ్రా వేరని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి