తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, పొన్నూరు మాజీ శాసనసభ్యులు, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయినప్పుడు కాపులపై అనుచితమైన వ్యాఖ్యలు చేశారని స్థానిక శాసనసభ్యుడు కిలారి వెంకట రోశయ్య నిరాధారమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో శాసన సభ్యుడు కిలారి వెంకట రోశయ్య కు ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ గారు సోమవారం పరువు నష్టం నోటీసు పంపించారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
అవాస్తవాలతో కాపు కులస్థుల మనోభావాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపు కునేందుకు రోశయ్య ప్రయత్నిస్తున్నారని నరేంద్ర కుమార్ గారు తన లీగల్ నోటీసు లో పేర్కొన్నారు. వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ ప్రకటించి, కోటి రూపాయలు నష్టపరిహారం గా చెల్లించని పక్షంలో కొర్టులో కేసు దాఖలు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు తన నోటీసులో హెచ్చరించారు.
ఇది చదవండి: సీబీఐ కి ఎమ్మెల్సీ కవిత లేఖ..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.