మాచర్ల మండలం విజయపురిసౌత్ లో నరసరావుపేట ఎంపీ, పార్లమెంట్ టీడీపీ (TDP) అభ్యర్థి లావు శ్రీ కృష్ణ దేవరాయలు (Lavu Sri Krishna devarayalu) పర్యటించారు. మత్యకారులు, గిరిజనులు, మైనారిటీ లతో ఎంపీ సమావేశం నిర్వహించారు. స్థానికులు తాగునీరు, రోడ్లు, కరెంట్ సమస్యలను ఎంపీ దృష్టి కి తీసుకురాగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. చదువుకున్న తమ పిల్లలు నిరుద్యోగులుగా మిగిలారని ఎంపీ ఎదుట కొందరు ఆవేదన వ్యక్తం చేయడం తో వారి వివరాలు అందజేస్తే తక్షణమే ఉపాధి కల్పిస్తానని చెప్పారు. టీడీపీ ముస్లిం లకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కొన్ని శక్తులు సోషల్ మీడియా ద్వారా లేనిపోని దుష్ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు. ఎంపీ సమక్షంలో వైసీపీ కి చెందిన 50 మత్యకారుల కుటుంబాలు, 40 గిరిజన కుటుంబాలు టీడీపీ లో చేరారు. ఎంపీ వెంట తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చిరుమామిళ్ల మధుబాబు, టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఎం.దారునాయక్ లు ఉన్నారు.
ఇది చదవండి: వాటర్ ప్లాంట్ లో ట్యాంక్ క్లీన్ చేస్తూ ప్రైవేటు ఎలక్ట్రిషన్ మృతి
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి