ఏపీలో బీసీ కులగణనపై రాజకీయం వేడెక్కింది. సీఎం జగన్ రాజకీయ కుట్రలో బీసీ కులగణన ఓ భాగమని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. రాజకీయ లబ్ది కోసమే ఈ కులగణన చేపట్టారని, రాష్ట్రంలో ఉన్న బీసీలు జగన్ ను నమ్మి ఈ కుట్రకు బలికావొద్దని అన్నారు. బీసీల సంక్షేమం కోసం పాటుపడుతున్నానని చెప్పుకునే జగన్, ఇన్నాళ్లు కుల గణన అంశంలో కేంద్రం మీద ఒత్తిడి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కుల గణన అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలని జగన్ కనీసం తన ఎంపీలకు కూడా చెప్పలేదని మండిపడ్డారు. ఈ అంశంపై ఇన్నాళ్లు ఎక్కడా మాట్లాడకుండా, ఎవరినీ ప్రశ్నించకుండా, ఉన్నట్టుండి కుల గణనను తెరపైకి తీసుకురావడం జగన్ రాజకీయ అవకాశవాదానికి నిదర్శనం అని అన్నారు. కుల గణన చేపట్టాలని చంద్రబాబు 2014లోనే కోరారని, కానీ కేంద్రం స్పందించలేదని కాల్వ శ్రీనివాసులు తెలిపారు.
Read Also..
Read Also..