కావటి మనోహర్ నాయుడు (Kavati Manohar Naidu) మీడియాతో మాట్లాడుతూ…
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివ నాగ మనోహర్ నాయుడు (Kavati Manohar Naidu)
కావటి మనోహర్ నాయుడు (Kavati Manohar Naidu) మీడియాతో మాట్లాడుతూ… 2019 జగనన్న ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అండదండగా ఉంటూ కష్టం అనే మాటని దరిచేరనీయకుండా ప్రతి ఒక్కరిని సొంత బిడ్డలా చేరదీస్తున్న ఏకైక నాయకుడు మన వైయస్ జగన్మోహన్ రెడ్డి అని చిలకలూరిపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివ నాగ మనోహర్ నాయుడు పేర్కొన్నారు. సాగర్ నుంచి మంచినీళ్ళు చెరువులకు వస్తున్న సందర్భంగా కావటి మనోహర్ పార్టీ నాయకులతో కలిసి మంచినీళ్ళ చెరువులను సందర్శించారు. ఈ సందర్భంగా కావటి మీడియాతో మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేట ప్రజలు మంచినీళ్లకు ఇబ్బంది పడిన రోజు ఏనాడు లేదని కావటి తెలిపారు.
ఇప్పటికి ప్రత్తిపాటి పుల్లారావు అంటే చాలామందికి తెలియదు. గుడ్డి పత్తి అమ్ముకునే పుల్లారావు అంటే టక్కున గుర్తొస్తుంది…
మొన్న ఏదో ప్రత్తిపాటి పుల్లారావు మంచినీళ్ల చెరువులను సందర్శించి ఏదో మతిభ్రమించి మాట్లాడుతున్నాడే తప్ప అందులో వాస్తవం లేదని కావటి స్పష్టం చేశారు. పుల్లారావు ప్రజలను తప్పుదోవ పట్టించి వైసిపి ప్రభుత్వం మీద బురద జల్లాలని చూస్తున్నారని కావటి తెలిపారు. పుల్లారావు మంత్రిగా ఉన్న హయాంలో పేట ప్రజలు మంచినీళ్ల కోసం అనేక ఇబ్బందులు పడ్డారని రెండు, మూడు రోజులకు ఒకసారి కూడా మంచినీళ్లు వదిలిన సందర్భాలు చాలా ఉన్నాయని ఈ సందర్భంగా కావటి తెలియజేశారు. పుల్లారావు నాలుగున్నర సంవత్సరాలు పేట ప్రజలను వదిలి పెట్టి తన వ్యాపారాల మీద అక్రమ ఆస్తుల మీద దృష్టి పెట్టాడే తప్ప ప్రజలని పట్టించుకోలేదన్నారు. ఈరోజున ఏదో ఎలక్షన్ లు ఉన్నాయని ఆరు నెలల నుంచి తూతూ మంత్రంగా ప్రచారాలు చేసినంత మాత్రాన పుల్లారావు గెలిచే పరిస్థితి లేదని కావటి తెలియజేశారు. నిజానికి ప్రత్తిపాటి పుల్లారావు అంటే చాలామందికి తెలియదని గుడ్డి పత్తి అమ్ముకునే పుల్లారావు అంటే ప్రజలకు టక్కున గుర్తొస్తుందన్నారు.
పుల్లారావు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయి…
అది పుల్లారావు నీచమైన రాజకీయ జీవిత చరిత్ర అని కావటి, పుల్లారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుల్లారావు మాట్లాడితే కావటి మనోహర్, మరియు అనిల్ కుమార్ యాదవ్ స్థానికుడు కాదని పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాడు. నిజానికి పుల్లారావు ఎక్కడి నుంచి వచ్చారో ఒక్కసారి చరిత్రని నెమరు వేసుకోమని తెలియజేశారు. నిజానికి పుల్లారావు కూడా ప్రకాశం జిల్లా నుంచి పేటకి బతుకుతెరువు కోసం వచ్చి గుడ్డి పత్తి అమ్ముకుంటూ అక్రమ ఆస్తుల కూడా పెట్టి రాజకీయంలోకి వచ్చాడే తప్ప నిజానికి పుల్లారావు కూడా స్థానికుడు కాదని ప్రకాశం జిల్లా నుంచి వచ్చాడని కావటి, పుల్లారావుపై మండిపడ్డారు. నిజానికి పుల్లారావు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉన్నాయని కావటి చురకలు వేశారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో మరల జగనన్నే ముఖ్యమంత్రి అవుతాడని చిలకలూరిపేటలో మేమే గెలుస్తామని కావటి ధీమా వ్యక్తం చేశారు.
ఇది చదవండి : సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు రూటే సప’రేటు’…
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: వైసిపి పై బురద జల్లాలని చూస్తున్నారు – కావటి