గుడివాడ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో నవరస నటనాసార్వభౌముడు కైకాల సత్యనారాయణ నిలువెత్తు కాంస్య విగ్రహా ఆవిష్కరణ వేడుకలు ఘనంగా జరిగాయి. కైకాల కుటుంబ సభ్యులతో కలిసి ఆయన విగ్రహాన్ని ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే కొడాలి నాని ఆవిష్కరించి, నిలువెత్తు పూలమాలతో నివాళుల్పించారు. ఒక వ్యక్తిగా గుడివాడలో ప్రస్థానం ప్రారంభించిన కైకాల సత్యనారాయణ, 8వందల చిత్రాల్లో నటించి లెజెండ్ గా ఎదిగిన మహోన్నతుడనీ ఆవిష్కరణ సభలో ఎమ్మెల్యే కొడాలి నాని కొనియాడారు. నాడు చంద్రబాబు సూచనలతో పార్లమెంట్ సభ్యుడిగా పోటిచేయమని ఆయనతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా, కైకాలను కోరిన వారిలో తాను ఉన్నానని, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడిగా కైకాల గెలవడమే కాక, తన ప్రభావంతో ఏలూరు, తెనాలి పార్లమెంట్ సభ్యులను కూడా గెలిపించిన సత్తా కైకాలదని నాటి విషయాలను ఎమ్మెల్యే నాని గుర్తు చేసుకున్నారు. సినీ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకున్న అజాతశత్రువైన కైకాల జీవితం ఆదర్శప్రాయమని ఎంపీ వల్లభనేని బాలశౌరి కొనీయాడారు. విద్యాభ్యాసం పూర్తిచేసుకుని, కళా రంగంలో ఓనమాలు నేర్చుకున్న గుడివాడలో కైకాల విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషకరమని ఆయన సోదరుడు సినీ నిర్మాత కైకాల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కైకాల కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే నాని, ఎంపీ బాలశౌరి సత్కరించారు. అనంతరం కాపు సేవా సమితి ఆధ్వర్యంలో కైకాల వర్ధంతి సందర్భంగా అన్నా సమారాధన నిర్వహించారు. విగ్రహవిష్కరణ వేడుకల్లో కైకాల బార్య నాగేశ్వరమ్మ, కుమారులు లక్ష్మీ నారాయణ , వెంటరామారావు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, కాపు సేవా సమితి అధ్యక్షుడు నల్లగంచు వెంకట రాంబాబు, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షులు పాలేటి చంటి, కాపు సేవా సమితి పెద్దలు అళ్ళ చెన్నకేశవ రావు, సుంకర గాంధీ, పంచకర్ల వెంకట్, పొన్నూరు రామకృష్ణ, అడబాల అప్పారావు, తోట శివాజీ, ఏపీ టిడ్కో డైరెక్టర్ పత్తివాడ చిన్నారి, మున్సిపల్ మాజీ చైర్మన్ రంగనాయకమ్మ, ప్రభాకర నాట్య మండలి కార్యదర్శి మట్టా రాజా, కైకాల కుటుంబ సభ్యులు, కళా కారులు, పెద్ద సంఖ్యలో కైకాల అభిమానులు, కాపు సంఘాల నేతలు పాల్గొన్నారు.
Read Also..