నూజివీడులో జరిగిన టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, ఏలూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్, నూజివీడు అభ్యర్థి కొలుసు పార్థసారథి. సిద్ధం, సిద్ధం అంటున్న జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి ప్రజల సంక్షేమం అంటూ లోపల ఆయన ఎంత నొక్కాడో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలన్న రాధాకృష్ణ. ఈ రాష్ట్రంలో బాగుపడింది ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్న వంగవీటి రాధాకృష్ణ. జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నట్లు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు పేదవారికి ధనికులకు మధ్య కాదని, అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రికి పేద ప్రజలకు జరుగుతున్న యుద్ధం అన్న వంగవీటి రాధాకృష్ణ.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని, జగన్ ముఖ్యమా… జనం ముఖ్యమా… జనం అనేది, జన బలం అనేది చాటి చెప్పాలని మనవి చేస్తున్నానన్న వంగవీటి రాధాకృష్ణ. ప్రజలంతా ఒక్కసారి ఆలోచించాలని, జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారంలో ఉన్నప్పుడు సంపాదించుకుని ఒక్క ఛాన్స్ అంటూ అదే డబ్బుతో ఎన్నికల్లో గెలిచాడని విమర్శించిన ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్. జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావడానికి కేవలం డబ్బుతోనే ఎన్నికలను నడుపుతున్నాడన్న పుట్టా మహేష్ యాదవ్. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓటర్లకు 2 వేలు ఇస్తారని, రోజుకు అది 90 పైసలు పడుతుందని, అధికారంలోకి వస్తే జగన్ రోజుకు 90 కోట్లు దూసుకునేందుకు సిద్ధం అవుతున్నాడన్న పుట్ట మహేష్ యాదవ్.
ఇది చదవండి: తిరుపతి నియోజకవర్గం నుంచి వైసీపీని పంపించేయాలి
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదన్న బర్మా ఫణి బాబు. నూజివీడు ట్రిపుల్ ఐటీ నుండి బయటకు వస్తున్న మురుగునీరు, పట్టణంలో సరైన డ్రైనేజీ లేకపోవడం, ఇరుకుగా ఉన్న అంతర్గత రహదారులు చూస్తే నూజివీడు ఎమ్మెల్యే పనితీరు అర్థం అవుతుందని విమర్శించిన బర్మా ఫణి బాబు. రాష్ట్రంలో ఐదేళ్లు రాక్షస పాలన మనం చూసామని, మరో ఐదేళ్లు జగన్ కు అవకాశం ఇస్తే మన రాష్ట్రం బీహార్ కంటే ఘోరంగా తయారవుతుందన్న బర్మా ఫణి బాబు. నూజివీడు నియోజకవర్గ ప్రజలు వివేకంతో ఆలోచించి ఉమ్మడి అభ్యర్థుల గెలుపుకు ప్రతి ఒక్కరూ తమ ఓటును వేయాలని కోరిన బర్మా ఫణి బాబు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లపాటు బటన్ నొక్కి పరిపాలన సాగించాడని విమర్శించిన ఉమ్మడి అభ్యర్థి కొలుసు పార్థసారథి.
రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయడంతో పాటు రైతులకు అవసరమైన ప్రాజెక్టులను, యువత ఉపాధికి అవసరమైన పరిశ్రమలను స్థాపించలేదన్న పార్థసారథి. ప్రజా సంక్షేమాన్ని మరచి మద్యాన్ని ఏరులై పారించిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందన్న పార్థసారథి. నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు నూజివీడుకు ఏమి చేయలేకపోయారని, జగన్ కూడా రాష్ట్రానికి వరగబెట్టింది ఏమీ లేదని విమర్శించిన పార్థసారథి.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.