నంద్యాల జిల్లా డోన్ మండలంలో నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఆదేశాలతో మరియు అడిషనల్ ఎస్పీ సెబ్ ప్రవీణ్ కుమార్ ఆదేశాలతో సూపర్డెంట్ ఆఫ్ సెబ్ రామ్మోహన్ రెడ్డి సూచన మేరకు రిలేబుల్ ఇన్ఫర్మేషన్ మీద డోన్ ఐటిఐ కళాశాల దగ్గర ఫుట్ వాచ్ చేస్తుండగా ఒక స్కార్పియో లో కర్నూల్ నుంచి డోన్ వైపు వస్తున్న స్కార్పియోని ఆపి చెకింగ్ చేయగా దానిలో 30 బాక్సుల కర్ణాటక టెట్రా ప్యాకెట్లు తీసుకుని వస్తుండగా అతని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేయగా నేను రాయచూరు నుంచి తెస్తున్న సార్ ట్రాన్స్పోర్ట్ నేను చేస్తాను. అమ్మ ఇంటిదగ్గర అమ్ముతాది సార్ అని ఆ వ్యక్తి చెప్పడంతో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి చెక్ చేయగా రెండు టెట్రా బాక్సులు ఇంట్లో ఉన్నవి కొడుకుని తల్లిని అదుపులోకి తీసుకుని వారిని విచారించగా మేము అక్కడ తక్కువ రేట్ కి తీసుకుని ఇక్కడ ఎక్కువ రేటు కొమ్ముకుంటాం సార్. ఇప్పుడు ఎన్నికల సమయం కావున బతుకుదెరువు కోసం వ్యాపారం చేయాల్సి వస్తుంది సార్ అని తల్లి కొడుకులు ఒప్పుకోవడం జరిగింది. తల్లి కొడుకుల పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. స్కార్పియో మద్యం బాక్సులను సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. ఒక్కొక్క బాక్స్ లో 96 టెట్రా ప్యాకెట్లు ఉంటాయని పోలీసులు తెలిపారు. మొత్తం 3070 టెట్రా ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ 2,60,000 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. Si సోమశేఖర రావు, హెడ్ కానిస్టేబుల్ జయచంద్ర, మల్లికార్జునరావు, రంగముని, తిరుపలయ్య, శబ్ సీఐ జయనాథ్ తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇదిచదవండి: పీలేరులో నారా భువనేశ్వరి కాన్వాయ్ ను అడ్డుకున్న పోలీసులు…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి