వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థులను నూటికి నూరు శాతం ప్రకటించిన జగన్ మోహన్ రెడ్డికి శుభాభినందనలు తెలుపుతూ.. తన గొంతులో ప్రాణం ఉన్నంతవరకు జగన్మోహన్ రెడ్డికి ఋణపడి ఉంటానని.. గన్నవరం నియోజకవర్గం నదీ పరివాహక ప్రాంతం కావడంతో వరదలు వచ్చినప్పుడు రెండు మూడు నెలల పాటు లంక గ్రామాలు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటున్నందున నేను గెలిచి ఎమ్మెల్యే అయిన వెంటనే ముందుగా వరదల తాకిడి లంక గ్రామాలకు తగలకుండా తగు జాగ్రత్తలను అందుకు కావలసిన రివిట్మెంట్ పనులు గురించి పాటు పడతానని.. పి గన్నవరం నియోజకవర్గం అభివృద్ధి కి నూటికి నూరు శాతం నా వంతు కృషి ఉంటుందని మీడియా పూర్వకంగా వైయస్సార్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విప్పర్తి వేణుగోపాల్ రావు మీడియా పూర్వకంగా తెలియజేశారు. బాణసంచాతో భారీ ఎత్తున వైయస్సార్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ సందర్భంగా పి గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి విప్పర్తి వేణుగోపాల్ వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పార్టీ ఆఫీసు నుంచి పి గన్నవరం త్రీరోడ్ సెంటర్ వరకు పాదయాత్ర చేసి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం డొక్కా సీతమ్మ అక్విడెక్ట్ దగ్గర ఉన్నటువంటి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం విప్పర్తి అభిమానులు వైఎస్ఆర్సిపి అభిమానులు ఎమ్మెల్యే అభ్యర్థిని.. గజమాలతో సత్కరించారు.
ఇది చదవండి: చంద్రబాబును ప్రజలు ఎవరు నమ్మరు – బుట్టా రేణుక