అవనిగడ్డ నియోజకవర్గ సమగ్రాభివృద్ధి ధ్యేయం – మండలి బుద్ధ ప్రసాద్ (Mandali Buddha Prasad)
గడిచిన అయిదేళ్లుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వెనుకబాటు తనానికి గురైన అవనిగడ్డ నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తానని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ (Mandali Buddha Prasad) అన్నారు.. జనసేన పార్టీలో చేరిన అనంతరం అవనిగడ్డలో శుక్రవారం సాయంత్రం తొలి సారి మీడియాతో మాట్లాడారు. భయపెట్టి పాలన సాగుతోందని, ఎవరికీ అభిప్రాయం చెప్పే స్వేచ్చ లేకుండా పోయిందని. చివరకు ప్రతిపక్షాల సమావేశాలకు వెళ్ళే వారిని బెదిరించడం చేశారని ఇలాంటి పాలనను అంతమొందించి ప్రతీ మనిషి స్వేచ్ఛను కాపాడటం, భయరహితులను చేయడం లక్ష్యమన్నారు… ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళే వారికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం, ధర్మ బద్ద పాలన ఇవ్వడం కూటమి లక్ష్యమని, ప్రజల అభిప్రాయాలు నా ఎజెండా అని అన్నారు..
అయిదేళ్ళు వెనుకబాటు తనానికి గురైన అవనిగడ్డ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యం..
ఈ అయిదేళ్ళు ఏమి జరిగిందో అందరూ చూసారని, అలాంటి పాలనకు చరమగీతం పాడేందుకే టిడిపి, జనసేన, బీజీపీ ఏకమయ్యాయన్నారు.. కూటమి గెలుపే లక్ష్యంగా తాను జనసేనలో చేరానని, పవన్ కళ్యాణ్ ఆహ్వానం, దానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆశీస్సులతోనే జనసేనలో చేరానన్నారు. యువత ఎక్కువగా ఉన్న పార్టీ జనసేన పార్టీ అనివారి కష్టంతో పార్టీని నడుపుకు వచ్చారని, వారి ఆకాంక్షలను నెరవేర్చడం కోసం ప్రతీ ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తానన్నారు.. పవన్ ఆలోచనలునా ఆలోచనలు ఒకే రకంగా ఉంటాయని. సమాజం గురించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని బుద్ధ్ప్రసద్ అన్నారు.. తెలుగు భాషా పరిరక్షణ.. మా భావాలు ఒకే రకంగా ఉన్నాయన్నారు..
పాత్రికేయుల సమావేశంలో మండలి..
సమాజం, ప్రజల గురించే ఆలోచించే తత్వం నాదీ పవన్ దీ అని . సంకుచిత భావాలు లేని వ్యక్తి పవన్ అని రాష్ట్రం లోని అరాచక పాలన అంతం చేసేందుకు పవన్ ఎన్నో త్యాగాలు చేశారన్నారు.. విధ్వంసక పరిపాలన సాగణంపతమే కూటమి ధ్యేయమని, ముగ్గురు నాయకులు దేని కోసం పోరాడుతున్నారో ఆయా పార్టీల కార్యకర్తలు అర్థం చేసుకోవాలన్నారు.. వ్యక్తిగత భావనలు పక్కన పెట్టి విశాల భావనతో ముందుకు రావాలని, టిక్కెట్లు ఆశించిన వారందరినీ కలుపుకు వెళతానన్నారు.. నియోజకవర్గ అభివృద్ధి కోసం అందరూ కలసికట్టుగా పనిచేయాలని . రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా అందరూ ముందుకు రావాలన్నారు…. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా బాలసౌరిని గెలిపించాలని, గాజు గ్లాసు గుర్తును మరింతగా నొరజలలోకి తీసుకు వెళ్లాలని బుద్ధ ప్రసాద్ కోరారు..
ఇది చదవండి : ఈ నెల 15 నుంచి ఆంధ్రప్రదేశ్ లో చేపల వేట నిషేధం…
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి