రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా ఎన్డీయే (NDA) విజయం సాధించాలి – చంద్రబాబు
రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీయే (NDA) విజయం సాధించాలని, ప్రజలు గెలువాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. రాబోయే ఎన్నికలు ఎంతో ప్రతిష్ఠాత్మకమని… అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నెల రోజుల తర్వాత మరొమారు కలుద్దామని…. ఎవరైనా అభ్యర్థులు సరిగా పని చేయకపోతే టీడీపీ ఆఫీసు నుంచి ఫోన్ వస్తుందని హెచ్చరించారు. వైకాపాకు అధికారం, అవినీతి, డబ్బు ఉందని దీంతో ఏమి చేసిన అడిగే వారు లేరనే దీమా వారిలో కనిపిస్తోందన్నారు. ఇదీ పార్టీలు, వ్యక్తిగత కోసం కాదని… మూడు పార్టీలు కలిసికట్టుగా పని చేయాలని సూచించారు……
విజయవాడ ఎ కన్వెన్షన్ సెంటర్లో అభ్యర్థులకు ప్రత్యేక వర్క్‌షాప్..
రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని టీడీపీ ఆధ్వర్యంలో విజయవాడలోని ఎ కన్వెన్షన్ సెంటర్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ప్రత్యేక వర్క్‌షాప్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు, టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు అచ్చన్నానాయుడు, జనసేన పార్టీ నుంచి నాదేళ్ల మనోహర్, బీజేపీ పార్టీ నుంచి పొతూరి నాగభూషణం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు నాయకులు దిశానిర్దేశం చేశారు. కేంద్రంలో ఎన్డీయేకు 400 కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని…. రాష్ట్రంలోనూ కూటమికి 160 కి పైగా అసెంబ్లీ సీట్లు వస్తాయని బాబు ధీమా వ్యక్తం చేశారు. కడప పార్లమెంట్ సీటు సైతం కూటమియే గెలవబోతుందని జోష్యం చెప్పారు. ఆ పార్టీ అభ్యర్థి.. ఈ పార్టీ అభ్యర్థి అని చూడొద్దని…. అందరూ ఎన్డీయే అభ్యర్థులుగానే భావించాలని సూచించారు. ఇవాళ మూడు పార్టీలు వేసే పునాదే.. 30 ఏళ్ల రాష్ట్ర భవిష్యత్తుకు నాంది కావాలని పిలుపునిచ్చారు.
నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు..
నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదన్నారు. ఇంతా దుర్మార్గం, అవినీతి, ఆరాచక పాలన దేశంలో ఎక్కడ లేదని మండిపడ్డారు. ఐదేళ్లలో జగన్ ఇంత ఘోరంగా రాజకీయాలు చేస్తారనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి వేధించడం, అబద్ధాలు చెప్పి మరోసారి గెలవాలని చూస్తున్నారన్నారు. విశాఖలో కంటెయినర్ దొరికితే తెదేపా పై విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు. బ్రెజిల్ అధ్యక్షుడు ఎన్నిక కాగానే విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారని…. ఇప్పుడు డ్రగ్స్ వచ్చింది బ్రెజిల్ నుంచే అని…. దీంతో డ్రగ్స్ మాపియాను పెంచి పోషించిందెవరో ప్రజలందరికీ తెలుస్తుందన్నారు. ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక అనేది చాలా కీలకమన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా కసరత్తు చేసినట్లు చెప్పారు. సమర్థులైన వ్యక్తులను ఎంపిక చేయకపోతే ప్రజల నుంచి ఆమోదం ఉండదన్నారు. రాష్ట్రంలో రౌడీయిజం, అధికార దుర్వినియోగం కనబడుతోందని హెచ్చరించారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు..
రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నామని మరోమారు పునరుద్ఘుటించారు. పద్ధతి ప్రకారం రాజకీయం చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని… పొత్తులో భాగంగా 31 మందికి సీట్లు ఇవ్వలేకపోయన్నారు. వాళ్లు చేసిన త్యాగం నేనెప్పుడూ మరచిపోనని.. సీట్లు రాని అభ్యర్థుల బాగోగులు చూసుకుంటానని భరోసా ఇచ్చారు. మూడు పార్టీల పొత్తు తర్వాత చాలా జాగ్రత్తగా అభ్యర్ధులను ఎంపిక చేశామన్న బాబు…. నిలబెట్టిన అభ్యర్ధి గెలవాలనేదే కూటమి లక్ష్యమన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి