Palnadu District :
పల్నాడు జిల్లా నరసరావుపేటలో స్థానిక నవయుగ కన్వెన్షన్ హాల్లో పల్నాడు జిల్లాలోని టీడీపీ సెల్ న్యాయ వాదులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, టీడిపి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు లేక ఆదాయం కోసం ప్రతి ఒక్కరూ గుంటూరు, విజయవాడకి వంటి ప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితి చూస్తున్నాము అన్నారు. గడిచిన ఐదేళ్లలో చేసినవి, రాబోయే ఐదేళ్లలో చేసేవి మీ ముందు ఉంచుతున్నాను అని కేంద్రంలో గత సంవత్సరం బడ్జెట్ లో ప్రతిపాదించిన విధంగా గోదావరి, పెన్నా నదులు అనుసంధానం రానున్న 5 సంవత్సరాలలో పూర్తి చేస్తాం అన్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
త్రాగునీటి కుళాయి ఇంటింటికి ఇవ్వాలని, ప్రతి ఊరికి ఓవర్ హెడ్ ట్యాంక్ తీసుకురావాలి అన్నారు. విద్య విషయంలో ఇప్పటికే JNTU పర్మినెంట్ బిల్డింగ్ లు ఏర్పాటు చేసుకున్నామని, అలానే పార్లమెంట్ పరిధిలో ఇప్పటికి 4 కేంద్రీయ విద్యాలయలు తెచ్చుకోగలిగామని అన్నారు. ఆరోగ్యానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పిడుగురాళ్లలో మెడికల్ కాలేజి ఏర్పాటు చేసుకున్నాము అని ఆదేవిధంగా ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో 100 పడకల హోప్సిటల్ ను ఏర్పాటు చేసుకోవాలి అని, ఇలా రానున్న 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేసేవి మీ ముందు ఉంచాను అని తెలియజేశారు.