ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి ఎయిర్పోర్ట్ కు 12 గంటల 50 నిమిషాలకు చేరుకుంటారు. MI- 17 హెలికాప్టర్ ద్వారా హిందూపురం సమీపంలోని లేపాక్షి లో హెలిపాడ్ లో దిగుతారు. అనంతరం లేపాక్షి లోని వీరభద్ర ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తరువాత, ఆలయంలోని శిల్ప సంపదను సందర్శిస్తారు. గంటపాటు లేపాక్షిలో గడిపిన అనంతరం హెలికాఫ్టర్ ద్వారా గోరంట్ల మండలం పాలసముద్రం లో ఉన్న నాసిన్ కేంద్రానికి చేరుకుంటారు. నూతనంగా నిర్మించిన నాసిన్ కేంద్రం ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ప్రధానితోపాటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, ఇద్దరు కేంద్ర సహాయ మంత్రులు, ఏపీ ముఖ్యమంత్రి జగన్, గవర్నర్ అబ్దుల్ నజీర్, ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం నాసిన్ కేంద్రం లోని పలు విభాగాలను ఆయన పరిశీలించిన అనంతరం ప్రత్యేక విమానంలో కొచ్చిన్ కు బయలుదేరి వెళ్తారు. ప్రధాని పర్యటన భద్రత ఏర్పాట్లను ఏపీ అడిషనల్ డీజీ శంకర్ భక్త భాజిల్ నేతృత్వంలో డిఐజి అమ్మిరాజు పర్యవేక్షిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఇప్పటికే ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. మరోవైపు ఏపీ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి ఎప్పటికప్పుడు పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.
సత్యసాయి జిల్లా పర్యటించనున్న ప్రధాని మోడీ…
86
previous post