రాయదుర్గంలో వేడెక్కుతున్న రాజకీయం (Political Heat)…
Political Heat : ఈ మధ్య కాలంలో లో వైసిపి అభ్యర్థి మెట్టు గోవింద రెడీ కు, తేదేపా అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు కు మధ్య నువ్వా నేనా అంటూ, సమర్ధత, అసమర్థత కు మధ్య రాజకీయం సాగుతోంది. రాయదుర్గం అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు నియోజకవర్గ స్థాయిలో ఎక్కడ ప్రచారానికి వెళ్లిన మెట్టు గోవిందరెడ్డి ఒక అసమర్థుడు, ఒక దద్దమ్మ, ఒక పనికి మాలిన వాడు, ఏ పని చేతకాని వ్యక్తి అంటూ ప్రజల ముందు, మీడియా ముందు మాట్లాడుతూ మెట్టు గోవిందరెడ్డి రెడీ చేసిన భూ కబ్జాలకు, నిలదీస్తూ రాయదుర్గం తేదేపా అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు ప్రచారం లో దూసుకుపోతున్నాడు. ఇంక వైసిపి అభ్యర్థి చూస్తే ఎవరు నన్ను ఏమన్న నేను పట్టించుకోను అంటూ పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు తిరుగుతూ మెట్టు గోవిందరెడ్డి ఎలక్షన్ కోడ్ సమయాన్ని వృధా చేస్తున్నారు.
విలేకర్ల తో మాకు అవసరం లేదు, మకు సోషల్ మీడియా ఉంది – రాయదుర్గం వైసిపి అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి
రాయదుర్గం లో పని చేస్తున్న మీడియాలను ధిక్కరిస్తూ, నాకు మీడియాతో పని లేదు నాకు వైసిపి తరుపున సోషల్ మీడియా ఉంది అంటూ మీడియా నీ కూడా చులకన చేసి మాట్లాడిన సందర్భం కూడా మనం చూసిందే. విలేకరులను రాయదుర్గం వైసీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి బహిష్కరించడం తో వారిలో కూడా ఈయనకు వ్యతిరేకత మొదలైంది. విలేకర్ల తో మాకు అవసరం లేదని, మాకు సోషల్ మీడియా ఉందని మా పబ్లిసిటీ మేమే చేసుకుంటామని వారితో దురుసు గా మాట్లాడి అందరి దృష్టిలో చెడ్డ పేరు తెచ్చుకున్నారు. తెదేపా పార్టీ అభ్యర్థి రోజు రోజుకు ప్రచారం లో దూసుకుపోతున్నాడు. రోజూ రోజుకు వైసిపి నుండి తెదేపాలో చేరుటకు వలసబాట పడుతున్న వైసిపి కార్య కర్తలు, ముఖ్య నాయకులు, ఇప్పటికే వేల సంఖ్యలో వైసిపి నుంచి తెదేపాలకు చేరికలు జరిగాయి. ఈ మధ్య కాలం లో అయితే మెట్టు గోవిందరెడ్డి సొంతుల్లో మెట్టుకు ముఖ్య అనుచరుడు అయిన ముల్లంగి బ్రదర్స్ తెదేపాలో చేరడం జరిగింది,ఆయన తో పాటు మెట్టు సొంతూరు మొత్తం టీడిపా కైవసం చేసుకుంది.
వైసిపి కార్యకర్తలను బీజేపీ వైపుకు మళ్ళించుకునే ఆలోచనలో కాపు రామచంద్రారెడ్డి..
రాయదుర్గం నియోజకవర్గం లో ఏ మండలానికి వెళ్లిన, ఏ పల్లెకు వెళ్లిన, ఏ ఇంటికి వెళ్లిన, తేదేపా ప్రభుత్యం అధికారం లోకి రావాలని, రాయదుర్గం లో కాల్వ శ్రీనివాసులు గెలవాలని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నట్లు కనబడుతోంది. వైసిపి కార్యకర్తలకు మాయ మాటలు చెప్పి బీజేపీ వైపుకు మళ్ళించుకోవడానికి కాపు రామచంద్రారెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఏ ఊరికి వెళ్లిన ప్రజలు కాల్వ శ్రీనివాసులు కు బ్రహ్మరథం పడుతున్నారు. ఇంక వైసిపి నాయకులు చూస్తే ఎక్కడ చూసినా భూ కబ్జాలకు కు పాల్పడుతూ, గవర్నమెంట్ స్థలాలను ఖబ్జా చేస్తూ, వాటిని వేరే వాళ్ళకి అమ్మూతు డబ్బులు దండుకుంటున్నారు. అధికారులు మాత్రం చూస్తూ వైసిపి నాయకులకు మద్దతు పలుకుతూ ప్రభుత్వ భూములను స్వాహా చేస్తు నగదును పంచుకుంటున్నారు. ఇప్పటికే ఎంతో మంది పేద కుటుంబాలు తమ భూములు కబ్జాకు గురయ్యాయి అని మొరపెట్టుకున్నా ఎవరికి చెప్పిన కూడా వారికి న్యాయం జరగడం లేదు అంటూ వారిలో వారే తమ భాదను ద్విగమింగుకుని వలస వెళ్లి పోవడం జరిగింది.
రెవెన్యూ అధికారుల అండతో వైసిపి నాయకులు ప్రభుత్వ భూముల కబ్జా..
ఒకపక్క ఇవేమి పట్టించుకోకుండా రెవెన్యూ అధికారుల అండతో వైసిపి నాయకులు ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారు. ఇదే విధంగా రాయదుర్గం లో వీఆర్వో తో కలిసి కొంత మంది వైసిపి కౌన్సిలర్ లు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ వాటిని అమ్ముకుంటూ నగదును దున్నుకుంటున్నారు. రాయదుర్గం వైసిపి కౌన్సిలర్ కు ఒక్కొక్కరికి 10 నుండి 20 ప్లాట్ లు దాక వీఆర్వో సహాయం తో దొంగ పట్టాలు చేసుకుని వాటిని అమ్ముకుంటున్నారు. ఇలాంటి వాటి వల్ల రాయదుర్గం లో పేద, మధ్య తరగతి జీవితాలు అధోగతి పాలవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అనంతపురం జిల్లా కలెక్టర్ గారు స్పందించి రాయదుర్గం లో జరుగుతున్న భూకబ్జాలను అపి, కబ్జాలకు పాల్పడిన వారిపై చర్యలు చేపట్టాలని రాయదుర్గం బాధిత ప్రజలు మొరపెట్టుకున్నారు. ఇలా కబ్జాలకు ముఖ్య కారణం అధికార వైసిపి ప్రభుత్యం కారణంగానే ఇలాంటి అగాయిత్యలు చోటు చేసుకున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు.
రాయదుర్గం లో సమర్థతకు అసమర్థతకు మధ్య రాజకీయం..
ఇక పోతే ఒక వైపు ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి బీజేపీ లో చేరిన సంఘటన మనకందరికీ తెలిసిన విషయమే, రాయదుర్గం బీజేపీ కాపు రామచంద్రారెడ్డి వైసిపి కార్యకర్తలను తన వైపుకు మళ్లించుకుని ప్రయత్నంలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దాదాపుగా రాయదుర్గంలో ఉన్న వైసిపి కౌన్సిలర్లు, మండల కేంద్రంలోని సర్పంచులు ఎంపీటీసీలు మండల కన్వీనర్లు, కార్యకర్తలు బిజెపి కాపు రామచంద్రారెడ్డి వైపు కు మల్లె అవకాశాలు ఉన్నట్లు కనబడుతోంది. మరోపక్క రాయదుర్గం బిజెపి జనసేన టిడిపి కూటమితో తెదేపా అభ్యర్థి కాలవ శ్రీనివాసులు తో పాటు కాపు రామచంద్రారెడ్డి ప్రచారం చేసేందుకు ఆసక్తి కనపడుతున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో రసవత్తరంగా ఎవరు గెలుస్తారో ఏమో అంటూ, అయోమయో స్థితిలో ప్రజలు ఉన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News.
ఇది చదవండి : స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకున్న భక్తులు…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి