మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. అమరావతి అసైన్డ్ భూముల కొనుగోలు కేసులో నారాయణతో పాటు ఇతరులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. సీఐడీ అభ్యర్థన మేరకు వచ్చే వారానికి న్యాయస్థానం పిటిషన్లను వాయిదా వేసింది. అసైన్డ్ భూముల కొనుగోలులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో సీఐడీ అధికారులు… మాజీ మంత్రి నారాయణ, ఇతరులపై కేసు నమోదు చేశారు. మరోవైపు తన భర్తను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ భార్య దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. అరెస్ట్ సమయంలో తీసిన ఫోటోలను పోలీసులు న్యాయస్థానానికి అందించారు. అంతకుముందే పిటిషనర్ తరఫు న్యాయవాది.. సీసీ ఫుటేజీని కోర్టుకు సమర్పించారు. ఈ కేసుపై నాలుగు వారాల తర్వాత విచారిస్తామని హైకోర్టు తెలిపింది.
హైకోర్టులో వాయిదా పడిన విచారణ….
42
previous post