బాలికల పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ అన్నారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా రాయచోటి డైట్ స్కూల్ వద్ద జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కొండయ్య అద్వర్యంలో ర్యాలి నిర్వహించారు. ఈ ర్యాలిలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలి డైట్ స్కూల్ నుంచి నేతాజీ సర్కిల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాలికా సంరక్షణతో పాటు సాధికారిత కల్పించే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాజ్యాంగ బద్ధంగా బాలికలకు కల్పించిన హక్కులను గౌరవించాలన్నారు. ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా అవకాశాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. బ్రూణ హత్యల నిరోధాన్ని సామాజిక బాధ్యతగా తీసుకుని వ్యతిరేకించాలన్నారు. తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో బాలబాలికల మధ్య తేడాలు చూపవద్దన్నారు. చిన్నతనం నుంచే బాలికలకు అవకాశాలు కల్పించినపుడే సమాజంలో మార్పు సాధ్యం అవుతుందన్నారు. ఆడపిల్లలకు ప్రభుత్వ పరంగా చాలా అవకాశాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య అధికారులు, వైద్యులు, సిబ్బంది, ఇసిడీఎస్ ఇంచార్జి పిడి శశికళ తో పాటు డైట్ ఇంచార్జి ప్రిన్సిపాల్ శివ బాస్కర్, డైట్ విద్యార్థినిలు పాల్గొన్నారు.
బాలికల పరిరక్షణ అందరి బాధ్యత..
112
previous post