సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన ఆరోపణలు చేశారు ఆర్టికల్ 370 పై వచ్చిన తీర్పు చాలా దురదృష్టకరమని అన్నారు. జమ్ము కాశ్మీర్ పైన
370 అర్టికల్ పైన వచ్చిన తీర్పు దురదృష్టకరమని, న్యాయ వ్యవస్థ ఒక పంజరంలోని చిలుకగా మారిపోయింది అని అన్నారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొనని పార్టీలకు దాని ప్రాధాన్యత ఎలా తెలుస్తుందని, అందుకే 370 అర్టికల్ గురించి వారికి తెలియడం లేదని ఆవేదన చెందారు. భారతదేశాన్ని విడగొట్టే రీతిలో బిజెపి పాలన సాగుతోందని,చివరకు నిజాంకు వ్యతిరేకంగా కూడా బిజెపి పోరాడలేదుని ఆరోపించారు. సుప్రీంకోర్టు తప్పు చేసిందని చెబుతున్నా ఇలా అన్నాఅని తనను అరెస్ట్ చేసినా ఫర్వాలేదు అన్నారు.సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ డెకాయిట్లతో సైతము రాజీపడ్డాడు అని ఆరోపించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో వీరుచుకుపడ్డారు నారాయణ… తెలంగాణ ఎన్నికల ఫలితాలే ఎపిలో పునరావృతం కాబోతున్నాయని, వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని, అవినీతికి పాల్పడమని ఎమ్మెల్యేలకు చెప్పిందే జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచేసిన తరువాత ఇన్చార్జ్ లను మార్చినంత మాత్రాన ఉపయోగమేంటి అని ప్రశ్నించారు.ఇన్చార్జ్ లు, ఎమ్మెల్యే అభ్యర్థులు కాదు వైసిపిలో సిఎం అభ్యర్థినే మార్చాలని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం, పాలన చేతకాకపోవడం వలననే వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమికి ప్రధాన కారణాలు అన్నారు. గాల్లో తిరిగే జగన్మోహన్ రెడ్డి అదే గాల్లోనే కలిసిపోతాడు అన్నారు. పొగరు, అవినీతి, అహంకారంకు కేరాఫ్ జగన్మోహన్ రెడ్డి అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. బైజ్యూస్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని, బైజ్యూస్, బజాజ్ కార్యాలయాలను పగులగొట్టండి అని అన్నారు. తుఫాన్ వల్ల తిరుపతి జిల్లాలో 60వేల ఎకరాల్లో వరిపంట నష్టం జరిగిందని, 18లక్షల ఎకరాలలో అన్ని రకాల పంట నష్టం జరిగిందని, మిచౌన్ తుఫాన్ ను జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేసారు.
సిపిఐ జాతీయ కార్యదర్శి సంచలన ఆరోపణలు….
53
previous post