బాపట్ల మండలం సూర్యలంక తీరంలో రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన సూర్యలంక బీచ్ ఉండటం బాపట్ల జిల్లాకు ఎంతో అదృష్టమని బాపట్ల ప్రజలు భావిస్తున్నారు. బాపట్ల సూర్యలంక బీచ్‌కు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి పర్యాటకులు భారీ సంఖ్యలో శని ఆదివారాలు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇదే అదునుగా భావించిన బాపట్లలోని లాడ్జి, రిసార్ట్స్ నిర్వాహకులు పర్యాటకులను నిలువు దోపిడీ చేస్తున్నారు. బాపట్ల సూర్యలంకకు రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత ఉంది. త్వరలోనే బాపట్ల సూర్యలంక బీచ్ ను బ్లూ ఫాగ్ గా ప్రకటించే ఆలోచనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాపట్ల సూర్యలంక బీచ్ పర్యాటక కేంద్రంగా విరజిల్లుతుంది. ఇక్కడకు పక్క రాష్ట్రం తెలంగాణ నుండి పండుగలకు న్యూ ఇయర్ వేడుకలకు భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో 2024 లో జరిగిన నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి అనేక మంది పర్యాటకులు సూర్యలంకకు విచ్చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా లాడ్జి, రిసార్ట్స్ నిర్వాహకులు ఒకటి నుండి పది రెట్లు ఎక్కువగా అద్దెలు వసూలు చేశారని పర్యాటకులు వాపోయారు. సూర్యలంక పర్యాటక ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని, మేము ఇక్కడికి వచ్చామని కానీ బాపట్లలోని లాడ్జి, రెస్టారెంట్ నిర్వాహకులు మమ్ములను నిలువు దోపిడీ చేస్తున్నారని వారు లాడ్జి నిర్వాహకులపై మండిపడ్డారు. గతి లేని పరిస్థితుల్లో వారు ఎంత అడిగితే అంతా అద్దెలు ఇచ్చి బస చేస్తున్నామని వారు వాపోయారు. బాపట్ల జిల్లా అయిన తరుణంలో బాపట్ల సూర్యలంకను ఎంతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తుంటే బాపట్ల లాడ్జి నిర్వాహకులు మాత్రం అందిన కాడికి పర్యాటకుల నుండి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. బాపట్ల జిల్లా అధికారులు లాడ్జి నిర్వాహకులను ఇక నుండి ప్రతి లాడ్జిల, రిసార్ట్స్ ముందు బస చేసే అద్దె గదుల రేట్ల వివరాలను తెలియపరిచే విధంగా డిస్ప్లే బోర్డులు పెట్టించాలని వారు జిల్లా ఉన్నతాధికారులను కోరారు. ముందు ఒక రేటు వచ్చిన తర్వాత పర్యాటకులు భారీ సంఖ్యలో సూర్యలంక పర్యాటక కేంద్రానికి వచ్చిన తర్వాత రూములు ఖాళీలేవని అనే సాకుతో పర్యాటకుల దగ్గర ఒకటి నుండి పది రెట్లు అద్దె ఎక్కువ వసూలు చేస్తున్నారని బాపట్లలోనీ లాడ్జి నిర్వాహకులపై ఆరోపణలు వెల్లి విరుస్తున్నాయి. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి లాడ్జి నిర్వాహకులపై చర్యలు తీసుకుంటారని పర్యాటకులు ఆశిస్తున్నారు. బాపట్ల సూర్యలంక బీచ్ పై అధికారులకు ఎటువంటి నియంత్రణ లేకుండా ప్రవర్తిస్తున్నారని పర్యాటకులు ఆరోపిస్తున్నారు. బాపట్ల సూర్యలంక బీచ్‌కు వెళ్లే దారిలో టోల్ గేటు నేపముతో నడిరోడ్డుపై టోల్ గేట్లు పెట్టి పార్కింగ్ ఫీజు అధికంగా వసూలు చేస్తున్నారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్కింగ్ చేసే ప్రదేశంలో వాహనాలకు తగిన వసతులు కూడా కల్పించకుండా రోడ్డుపైనే వాహనాలు ఆపి టోల్ ఫీజు వసూలు చేసుకొని మాకు ఏమి సంబంధం లేదు అనే విధంగా టోల్గేట్ నిర్వహకులు వ్యవహరిస్తున్నారని పర్యాటకులు ఆరోపిస్తున్నారు. ఇకపోతే బాపట్ల సూర్యలంకకు సముద్రం ఒడ్డున ఎటువంటి అనుమతులు లేకుండా ప్రైవేట్ రిసార్ట్స్ వెలిశాయని, ఆ రిసార్ట్స్ లో కనీస వసతులు కూడా లేకుండా ఒక్కొక్క గదికి 3000 నుండి 4000 రూపాయలు వారాంతపు సెలవు రోజుల్లో వసూలు చేస్తున్నారని పర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల సూర్యలంక పర్యాటక ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖకు చెందిన ఒకే ఒక్క హరిత రిసార్ట్స్ ఉందని అవి పెద్దలకు ధనవంతులకే అందుబాటులో ఉంటాయని పేద మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండవని పర్యాటకులు అంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి బాపట్ల సూర్యలంక తీరంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా వసతి గదులు నిర్మించాలని పర్యాటకులు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ఇకపోతే బాపట్ల సూర్యలంక తీరంలో తినుబండారాల విషయానికొస్తే ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా పదార్థాలు తయారు చేస్తున్నారని, మరియు ఒకసారి కాచిన నూనెలో పదేపదే చేపలు, మాంసాహారాలు తయారు చేస్తున్నారని దీని మీద ఆహార నియంత్రణ అధికారుల పర్యవేక్షణ లేదని, ఇలాంటి పదార్థాలు పర్యాటకులు స్వీకరిస్తే రోగాల బారిన పడే ప్రమాదం కూడా ఉందని పర్యాటకులు అంటున్నారు.
సూర్యలంక పై ప్రత్యేక కథనం…
50
previous post