తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాలకృష్ణ., రాష్ట్ర మంత్రి కారంపూడి నాగేశ్వరరావు., టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ., టిడిపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామిలు వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ మాట్లాడుతూ.. తమిళనాడులో గత మూడేళ్లుగా విపరింతంగా గంజాయి., మత్తుపదార్థాల విక్రయాలు సాగుతున్నాయన్నారు. మత్తుపదార్థాలపై కథనాలు తీసే సమయంలో పత్రిక విలేకర్లపై దాడికి డిఎంకే నాయకులు తిరగబడ్డారని అన్నారు. ఎమర్జెన్సీ పాలన తమిళనాడులో కనిపిస్తుందన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: త్రివేణి హైస్కూల్ లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు..
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి