ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం సత్తన్న గూడెం లో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. గ్రామ శివారు తోటల్లో పులి పాదముద్రలను గుర్తించిన రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పాదముద్రలను సేకరించారు. అయితే పాదముద్రలు పరిశీలించగా అవి పెద్దపులి పాదముద్రలుగా అధికారులు ప్రాథమిక నిద్దరణ చేశారు. అధికారిక నిర్ధారణ కోసం వైల్డ్ లైఫ్ ల్యాబ్ కి వాటిని పంపించారు. అదేవిధంగా దెందులూరు మండలం పేరుగుగూడెంలో మొక్కజొన్న తోటలలో పెద్దపులి పాదముద్రలను గుర్తించి వాటిని సైతం అధికారులు సేకరించారు. గత వారం రోజులుగా ఏలూరు జిల్లాలో బుట్టాయిగూడెం కొయ్యలగూడెం అదేవిధంగా నల్లజర్ల తాజాగా ద్వారకాతిరుమల దెందులూరు మండలాలలో పులి సంచారంతో జిల్లా ప్రజలు బెంబేలెత్తుతున్నారు.. పులి ఏ వైపు నుంచి వచ్చి ఎటు దాడి చేస్తుందోనని రాత్రి అయితే ఇళ్లలో నుంచి బయటకు రాని పరిస్థితి. అదేవిధంగా బుట్టాయిగూడెం కొయ్యలగూడెం మండలాలలో తోటలలో పనులుకు సైతం కూలీలు పులి భయంతో వెనుకడుగు వేస్తున్నారు. పులిని పట్టుకునేందుకు అది సంచరించిన ప్రదేశాలలో ట్రాప్ కెమెరాలు అమర్చి, దాని కదలికలు గుర్తించి బోన్ల సహాయంతో వాటిని బంధించాలని ప్రజలు కోరుతున్నారు.
కలకలం రేపుతున్న పెద్దపులి..
86
previous post