33
పశ్చిమగోదావరి మిచౌoగ్ తుఫాన్ కారణంగా 15 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, నష్టపోయిన ప్రతి రైతుని ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలంలో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరు ప్రసాదరాజు తో కలిసి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే ధాన్యాన్ని కొనుగోలు చెయ్యమని మిల్లర్ల ను ఆదేశించామన్నారు . ఎక్కడైనా మిల్లర్లు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని , రైతుల నుంచి చివరి గింజ కొనుగోలు చేసే వరకు బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి మాట్లాడుతూ రైతులకు గోనే సంచులను కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తుందన్నారు