ఏపీ భూహక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని తిరుపతి బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ చట్టంతో ప్రజల భూములపై లీగల్ పరిజ్ఞానం లేని అధికారులే శాసించే ప్రమాదం ఉందన్నారు. ఏపీ భూహక్కు చట్టం వలన సామాన్య ప్రజల భూములకు రక్షణ ఉండదని, ఈ చట్టం పేదల పాలిట శాపంగా మారుతుందని హెచ్చరించారు. న్యాయ పరిజ్ఞానం లేని అధికారుల నిర్ణయాలతో ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. డిసెంబర్ 1 నుంచి తిరుపతి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించి నిరసనలు చేపట్టారు. తిరుపతి కోర్టు ముందు బుధవారం నిరసనకు దిగిన అడ్వకేట్లు ర్యాలీగా వెళ్లి ఎన్టీఆర్ సర్కిల్ ముందు మానవహారం నిర్వహించారు. గురువారం బైక్ ర్యాలీ చేపట్టి ఆర్టీసీ బస్టాండ్ ముందు మహాత్మా గాంధీ, డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రం ఇవ్వనున్నారు. తిరుపతి కోర్టు ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి.వెంకటకుమార్ , ఉపాధ్యక్షుడు టి. గోపిచంద్, ప్రధాన కార్యదర్శి ఎం.మురళి, మహిళా ప్రతినిధి వై.కె.మల్లీశ్వరిదేవి, సీనియర్ న్యాయవాదులు కంచి ప్రకాశం, ప్రభాకర్ నాయుడు, చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు యోగానంద్, బి.ఉషాకిరణ్, టి.దినకర్, సామంచి శ్రీనివాస్, పలువురు అడ్వకేట్లు నిరసన చేపట్టిన న్యాయవాదులు పాల్గొన్నారు.
పేదల పాలిట శాపంగా మారిన భూ హక్కు చట్టం…
62
previous post