ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ వెలుగులు తీసుకొచ్చేందుకే తెలుగుదేశం, జనసేన, బిజెపి లు కూటమిగా ఏర్పడ్డాయి. ఈ నెల 17 వ తేదిన చిలకలూరి పేట లో జరిగే టీడీపీ, జనసేన, బిజెపి ఉమ్మడి బహిరంగ సభ ను విజయవంతం చేయాలని మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. ప్రజలు ఆంధ్రప్రదేశ్ ను వెలుగులోకి తీసుకుని రావటానికి ఈ కూటమి ఏర్పాటుకు గల కారణామని, ప్రజలు అర్థం చేసుకొని సహకరించాలని మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ కోరారు. అవనిగడ్డలో జరిగిన తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల ఉమ్మడి సమావేశంలో బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ జగన్ పరిపాలనలో అభివృద్ధి అనే పదానికి నిర్వచనం లేకుండా పోయిందని, యువతకు భవిత లేకుండా పోయిందని, రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో పయనింప చేయాలన్నా, యువతకు ఉపాధి, విద్యావకాశాలను కల్పించాలంటే తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వ కూటమికి ప్రజలందరూ మద్దతుగా నిలవాలని కోరారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఐదు సంవత్సరాలుగా అవనిగడ్డ నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందని, గత తెలుగుదేశం ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలను రద్దు చేశారని, మొదలైన అభివృద్ధి కార్యక్రమాలను నిలిపివేశారని, ఇప్పుడు ఐదేళ్ల తర్వాత శంకుస్థాపనలంటూ ప్రజలను మరోసారి మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని బుద్ధ ప్రసాద్ గడిచిన నాలుగు రోజులుగా నియోజకవర్గంలో జరుగుతున్న శంకుస్థాపనల గ్రామాలపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పిందని, కానీ ఆర్బికేల ద్వారా ధాన్యాన్ని అమ్ముకున్న రైతులకు 50 రోజులుగా చెల్లింపులు జరపలేదని విమర్శించారు. ఒక్కో ఆర్బికేలో కనీసం 150 మంది రైతులకు ఇంకా వారు అమ్మిన ధాన్యానికి డబ్బులు జమ కాలేదని, ఒక అవనిగడ్డ నియోజకవర్గంలోనే దాదాపు 30 కోట్ల రూపాయల మేర రైతులకు బకాయిలు ఉన్నాయని బుద్ధ ప్రసాద్ విమర్శించారు. రైతులను నట్టేట ముంచి ఇప్పుడు ప్రజలను మోసగించేందుకు శంకుస్థాపనల పేరుతో స్థానిక వైసీపీ నాయకులు తిరగటం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో డ్రైనేజీ పనులు కేవలం కాగితాలపై లెక్కలకే పరిమితమైందని, కాగితాల పైనే పనులు పూర్తయినట్లుగా సూచించుకుని డబ్బు మెక్కేశారని బుద్ధ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నెల 17వ తేదీన చిలకలూరిపేట మండలం బొప్పిడి గ్రామంలో జరిగే తెలుగుదేశం, జనసేన, బిజెపి ల ఉమ్మడి బహిరంగ సభను జయప్రదం చేయాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, జనసేన, బిజెపి నాయకులు సంయుక్తంగా విజ్ఞప్తి చేశారు… మూడు పార్టీల కలయికకు గల కారణాలను వివరిస్తూ రాష్ట్రం మరోసారి అభివృద్ధి పథంలో పయనించాలంటే తెలుగుదేశం, జనసేన, బిజెపిల పొత్తును ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలని, 17 వ తేదీన జరగబోయే బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొంటారని తెలిపారు..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి