హుకుంపేట మండలం డోంకిన వలస జంక్షన్ నుంచీ గేదెల పాడు వరకు 5 కిలోమీటర్లు మేరా తారు రోడ్డు నీ నాసిరకం గా నిర్మించిన కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర మేధావుల కన్వినర్ కురుస పార్వతమ్మ డిమాండ్ చేశారు. హుకుంపేట మండలం లోని జెర్రకొండ పంచాయతీ గేదెల పాడు గ్రామాన్ని స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తల తో కలిసి సందర్శించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నాసిరకంగా నిర్మించిన తారు రోడ్డును పరిశీలించాలని అన్నారు. గ్రామస్తుల పిర్యాదు మేరకు గేదెల పాడు గ్రామం లో నిర్మించిన తారు రోడ్డును పరిశీలించినట్లు తెలిపారు. ఎన్ ఆర్ ఈ జి ఎస్ కేంద్ర ప్రభుత్వ నిధులు సుమారు 2 కోట్ల రూపాయల తో నిర్మించిన తారు రోడ్డు మున్నాళ్ళ ముచ్చటగా మిగిలిందన్నారు. రోడ్డు నిర్మించిన 10 రోజుల్లోనే రోడ్డు మధ్యలో గడ్డి మొక్కలు మొలిచాయని, కాలి తో గట్టిగ కెలికితే ముక్కలు ముక్కలు గా రోడ్డు ఊడి వస్తుందన్నారు. 75 సంవత్సరాల తరువాత గ్రామానికి రోడ్డు మంజూరు ఐతే ఈ విధంగా గుత్తేదారు నిర్లక్ష్యం తో రోడ్డు నిర్మించడం శోచనీయం అన్నారు. సంబంధిత జిల్లా ఉన్నత అధికారుల పర్యవేక్షణ లోపం కారణం గానే ఈ విధంగా రోడ్డు నిర్మాణం జరిగిందని ఆరోపించారు. ఇంత జరిగిన స్థానిక గ్రామాల గిరిజన ప్రజలు ఆందోళన చేస్తున్నారు తప్ప, వీరి ఓట్ల తో గెలిచినా స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ సమస్య పై మాట్లాడక పోవటం పై పలు అనుమానాలకు దారి తీస్తుందన్నారు. నాసిరకం గా రోడ్డు నిర్మించి 2 కోట్ల ప్రజా ధనం వృధా చేసిన కాంట్రాక్టర్ పై జిల్లా కలెక్టర్ కి బీజేపీ తరుపున పిర్యాదు చేస్తామని తెలిపారు. మిగతా గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న పధకాలైన నాణ్యతతో నిర్మించేలా జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మఠం శాంత కుమారి మాట్లాడుతూ.. నాసిరకం నిర్మాణం చేసిన కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టి, ఇతర ప్రభుత్వ పనులు అతనికి కాంట్రాక్టు ఇవ్వకుండా చూడాలని జిల్లా కలెక్టర్ గారిని కోరారు. రోడ్డు నిర్మాణం జరుగుతున్నప్పుడు క్వాలిటి కంట్రోల్ అధికారులు పర్యవేక్షణ చెయ్యాల్సిన అవసరం ఉన్న, అసలు ఆ డిపార్ట్మెంట్ ఉందొ లేదో ప్రజలకు తెలియటం లేదన్నారు. వాళ్ళ పరిశీలన గనక ఉంటే ఈ విధంగా 2 కోట్ల రూపాయల ప్రజా ధనం వృధా కాకుండా ఉండేదన్నారు. తక్షణమే సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పాంగి మత్స్య కొండ బాబు, బీజేపీ మండల నాయకులు సింహ చలం, సింహాద్రి, గేదెల పాడు గ్రామ ప్రజలు, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Read Also..