జిల్లా ఎస్పీ యూ.రవి ప్రకాష్ ఆదేశాల మేరకు పెనుగొండ లో రాత్రి పూట తాళాలు వేసి ఉన్న ఇళ్లలో జరుగుతున్న దొంగతనాల కేసులో తప్పించుకు తిరుగుతున్న నిందితున్ని పెనుగొండ పోలీసులు అరెస్టు చేసారు. నరసాపురం ఇంఛార్జి sdop జీ.వీ.ఎస్ పైడేశ్వరరావు పెనుగొండ పోలీసు స్టేషన్ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడుతూ పెనుగొండ గ్రామంలోని చెరుకువాడకు చెందిన కోసూరి కరుణ (33సం) జల్సాలకు అలవాటు పడి రాత్రి పూట తాళాలు వేసిన ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి బంగారం, మరియు వెండి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అంతే కాకుండా బైక్ లు దొంగతనాలకు కూడా పాల్పడేవాడని దొంగిలించిన వెండి, బంగారం వస్తువులను ఫైనాన్స్ కంపెనీలలో తాకట్టు పెట్టి తన అవసరాలకు ఉపయోగించుకునేవాడని తెలిపారు. పెనుగొండ ఇన్స్పెక్టర్ మరియు ఆయన సిబ్బందితో మరియు మధ్య వర్తులతో తేదీ.08-12-2013 తేదీన చెరుకువాడలో ముద్దాయి ఇంటి వద్ద సుమారు 5 గంటల సమయంలో అదుపులోకి తీసుకొని విచారించగా తన నేరచరిత్ర అంతా బయటపడింది. పట్టుబడిన కోసూరి కరుణ గత ఎనిమిది నెలల నుండి పాలకొల్లు మరియు పలు చోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు తేలింది .అతని నుంచి సుమారు 12.5 కాసుల బంగారం, ఒక కేజి వెండి ఒక మోటార్ సైకిల్ రూ. 8,00,000 లక్షల విలువగల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలందరూ మోటార్ సైకిళ్ళుకు జీపీఎస్ సదుపాయం ఏర్పాటు చేసుకోవాలని, అలాగే ఇళ్లల్లో ఉన్న బంగారం మరియు నగదును వీలైనంత మేర బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గజ దొంగ అరెస్ట్..
60
previous post